Begin typing your search above and press return to search.
చైనా నిర్ణయంతో ఊచకోతలో సెన్సెక్స్
By: Tupaki Desk | 24 Aug 2015 6:09 AM GMTమారిన ఆర్థిక పరిస్థితులు.. విధానాలు.. నిర్ణయాలతో స్టాక్ మార్కెట్ ఎంత బలహానంగా ఉందన్న విషయం తాజా పరిణామంతో మరోసారి అర్థమయ్యే పరిస్థితి. బ్లాక్ సండే అనే మాటకు అసలుసిసలు అర్థంగా సోమవారం భారత స్టాక్ మార్కెట్ ను చూస్తే అర్థమవుతుంది. వారాంతం తర్వాత మొదలైన మార్కెట్.. ఆరంభంలోనే భారీ కుదుపునకు గురైంది. సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పాయింట్ల మేర పడిపోయింది.
ఈ మహా పతనంతో కళ్ల ముందు.. లక్షల కోట్ల రూపాయిలు ఆవిరైన పరిస్థితి. ఎన్నో లక్షల కుటుంబాల మీద ప్రభావం చూపించే ఈ నిర్ణయంతో మార్కెట్ భారీ కుదుపునకు గురైంది. పరిస్థితి ఎంత తీవ్రంగా లేకపోతే.. భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మీడియా ముందుకు వచ్చేస్తారు. స్టాక్ మార్కెట్ ఇంత భారీ నష్టానికి గురైన పరిస్థితి మీద ఆయన వివరణ ఇచ్చారు. చైనాలో చోటు చేసుకున్న పరిణామాలతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని.. చైనాలో యూరోలను కుదించుకోవాలన్న నిర్ణయం..సెన్సెక్స్ ఊచకోతకు గురి కావటమేకాదు.. భారీ పతనానికి కారణమైందని చెప్పుకొచ్చారు.
ఒక దశలో వెయ్యి వరకు పడిపోయిన మార్కెట్ కాస్త సర్దుకొని 830 పాయింట్ల వద్ద ఆగింది. సెన్సెక్స్ తో పాటు నిఫ్టీ ది కూడా అదే బాట. తాజాగా చోటు చేసుకున్న మహపతనం పుణ్యమా అని.. భారత స్టాక్ మార్కెట్ విలువ తక్కువలో తక్కువ రూ.2.5 నుంచి రూ.3లక్షల కోట్ల మేర ఉంటుందని అంచనా.. కాస్త అటూఇటూగా ఇంత భారీ నష్టం కేవలం కొన్ని గంటల్లో చోటు చేసుకోవటం గమనార్హం.
ఉదయం భారీ పతనానికి గురైన సెన్సెక్స్ ఒక దశలో కాస్త రికవరీ అయినట్లే అయి.. ఉదయం 11 గంటల సమయంలో మరోసారి మహా పతనం దిశగా అడుగులేస్తోంది. మార్కెట్ మొదలైన వెంటనే వెయ్యి పాయింట్ల వరకూ నష్టపోయిన సెన్సెక్స్ తర్వాత తేరుకొని 830 రికవరీ అవుతున్న సమయంలో మళ్లీ భారీ కుదుపునకు గురైంది. ఉదయం 11.30 గంటల సమయానికి సెన్సెక్స్ 1150 పాయింట్లు కోల్పోయి భారీ నష్టం దిశగా అడుగలేస్తోంది.
మరోవైపు.. డాలర్ తో రూపాయి మారక విలువ సైతం రికార్డు స్థాయిలో పడిపోయింది. గత కొద్ది కాలంగా డాలర్ తో పోలిస్తే.. రూపాయి పతనం కావటం తెలిసిందే. కాకపోతే.. తాజా పతనం రెండున్నరేళ్ల కనిష్ఠానికి చేరుకుంది. ప్రస్తుతం ఒక అమెరికా డాలర్ రూ.66.47 పలుకుతోంది. రెండున్నరేళ్లలో ఇదే అత్యధిక కనిష్ఠంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఈ మండే మార్కెట్ తో పాటు.. మదుపుదారుల గుండెలు మండిపోయేలా చేసిందని చెప్పక తప్పదు.