Begin typing your search above and press return to search.

చైనా మేడ్ పీపీఈ కిట్లు... వాడేందుకే పనికి రావంట

By:  Tupaki Desk   |   16 April 2020 11:30 PM GMT
చైనా మేడ్ పీపీఈ కిట్లు... వాడేందుకే పనికి రావంట
X
చైనా మాల్ అంటేనే... నాసిరకానికి పెట్టింది పేరు. సేమ్ కేటగిరీలో ఇతర కంపెనీల వస్తువుల కంటే చాలా తక్కువ ధరకే లభించే చైనా గూడ్స్.. నాణ్యత, మన్నికలో మాత్రం ఏ చిన్న కంపెనీ స్టాండర్డ్స్ నూ పాటించవన్న వాదన ఆది నుంచి ఉన్నదే. ఇప్పుడు ప్రాణాంతక వైరస్ కరోనా వేళ కూడా అదే మాట మరోమారు నిజమైందనే చెప్పాలి. కరోనా రోగులకు చికిత్సలు అందించే వైద్య సిబ్బందికి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ (పీపీఈ) కిట్లుల తప్పనిసరి కదా. అయితే కరోనా వ్యాపించినంత వేగంగా పీపీఈ కిట్లను రూపొందించడం సాధ్యం కాలేదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాల్లోనూ పీపీఈ కిట్లకు కొతర ఏర్పడింది. ఈ కొరతను క్యాష్ చేసుకునేందుకు ఎంట్రీ ఇచ్చిన చైనా కంపెనీలు.. నాసిరకం, అసలు వాడేందుకే సాధ్యం కాని పీపీఈ కిట్లను పంపిణీ చేస్తోందట.

ఈ తరహా అనుభవం భారత్ ఇప్పటికే చవిచూసింది. ఈ నెల 5న భారత్ పంపిన ఇండెంట్ల మేరకు చైనా నుంచి 1.70 లక్షల పీపీఈ కిట్లు గౌహతికి చేరాయి. తీరా వాటిని పరిశీలించి చూస్తూ... వాటిలో మెజారిటీ కిట్లు నాసిరకంగా ఉండగా... 50 వేల కిట్లు అసలు వాడేందుకు కూడా పనికి రాకుండా ఉన్నాయట. అంటే... నాసిరకం ఉత్పత్తులకు కేరాఫ్ అడ్రెస్ చైనానే అంటూ తనపై పడిన ముద్రను కరోనా వేళ కూడా చైనా సార్ధకం చేసుకుందన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే... ఇటీవల తన మిత్ర దేశం పాకిస్థాన్ కు కూడా చైనా ఇదే తరమాలో నాసిరకం పీపీఈ కిట్లను సరఫరా చేసి విమర్శల పాలైంది.

చైనా గూడ్స్ అన్నీ నాసిరకమని, చివరకు పీపీఈ కిట్లు కూడా నాసిరకమైనవేనని తేలిపోయినా... కరోనా వేళ ఆ దేశం నుంచి పీపీఈ కిట్లను దిగుమతి చేసుకోక తప్పడం లేదు. అటు ప్రభుత్వాలతో పాటు ఇటు బడా కార్పొరేట్ సంస్థలు కూడా పీపీఈ కిట్ల కోసం చైనాకు భారీ ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నాయి. తాజాగా భారత్ నుంచి అందిన ఆర్డర్ల మేరకు చైనా నుంచి గురువారం ఏకంగా 6.50 లక్షల పీపీఈ కిట్లు డిస్పాచ్ అయ్యాయట. మరి 1.70 లక్షల కిట్లలోనే ఏకంగా 50 వేల కిట్లు పనికి రాకుండా పోతే.. ఇప్పుడు వస్తున్న 6.50 లక్షల కిట్లలో ఎన్నింటిని పారేయాల్సి వస్తుందో చూడాలి.