Begin typing your search above and press return to search.

ఒక్క సిగరెట్‌ కు 51 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి

By:  Tupaki Desk   |   28 Jan 2019 3:01 PM GMT
ఒక్క సిగరెట్‌ కు 51 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి
X
డ్రైవర్‌ నిర్లక్ష్యంగా ఉంటే ప్రయాణికులకు ఎంత ప్రమాదమో అందరికి తెలిసిందే. అందుకే డ్రైవింగ్‌ లో ఉన్నప్పుడు ఫోన్‌ లు మాట్లాడడం కానీ - సిగరెట్‌ లు కాల్చడం కానీ చెయ్యొద్దని డ్రైవర్లకు కఠినమైన రూల్స్‌ పెడతారు అధికారులు. మన ఆర్టీసీ బస్సుల్లో ఈ నిబంధనలు తూచ తప్పకుండా పాటించాల్సిందే. ఆర్టీసీ బస్సులోనే ఈ రకమైన రూల్స్‌ ఉంటే.. ఇక విమానంలో రూల్స్‌ ఎంత స్ట్రిక్ట్‌ గా ఉంటాయో చెప్పనవసరం లేదు. కానీ ఒక పైలెట్‌ సిగరెట్‌ కక్కుర్తి వల్ల 51 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అయితే ఈ సంఘటన ఇప్పుడు జరిగింది కాదు. 10 నెలల క్రితం జరిగింది.

యూఎస్‌-బంగ్లా విమానయాన సంస్థకు చెందిన బంబార్డియర్‌ యూబీజీ -211 విమానం గతేడాది ల్యాండింగ్‌ అవుతుండగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో సిబ్బందితో సహా 51 మంది మరణించారు. మొత్తం 67 మందికి 16 మంది మాత్రమే బతికి బయటపడ్డారు. అయితే విమానం క్రాష్‌ ల్యాండింగ్‌ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని మొదట భావించారు. ఆ తర్వాతే విచారణలో అసలు నిజం తెలుసుకుని ఆశ్చర్యపోయారు.

విమానంలో కాక్‌ పిట్‌ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు పైలెట్‌ క్యాబిన్‌ లో వాయిస్‌ లను రికార్డు చేస్తుంది. కూలినపోయిన విమాన కాక్‌ పిట్‌ ని అధికారులు పరిశీలించారు. ల్యాండింగ్‌ సమయంలో విమానం దాదాపు కిందకు వచ్చేసింది. దీంతో.. ఇంకేముంది మనం క్షేమంగా చేరుకున్నాం అనే ఉద్దేశంతో పైలట్‌ సిగరెట్‌ వెలిగించాడు. సిగరెట్‌ తాగే ఆనందంలో విమానం సరిగ్గా ల్యాండ్‌ అవుతుందా లేదో అనే విషయాన్ని సీరియస్‌గా పట్టించుకోలేదు. దీంతో.. విమానం క్రాష్‌ అయ్యింది. సిగరెట్‌ తాగే సమయంలో పైలెట్‌ మాటలన్నీ కాక్‌ పిట్‌ లో రికార్డు అయ్యాయి. ఒకరు చేసిన తప్పునకు 51 మంది బలయ్యారు. ఈ ప్రమాదంలో సదరు పైలెట్‌ కూడా చనిపోయాడు.