Begin typing your search above and press return to search.
ఘర్షణలో చైనా సైనికులు ఎందరు మరణించారు?
By: Tupaki Desk | 18 Jun 2020 3:30 PM GMTభారత్-చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో సోమవారం సైనికుల మధ్య ఘర్షణ జరిగి 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక భారత సైనికులు చంపుతూ చనిపోయారని.. చైనా వైపు కూడా భారీగా ప్రాణ నష్టం జరిగిందని ప్రధాని మోడీ పరోక్షంగా ప్రస్తావించారు.
ఇంతకీ ఈ ఘర్షణలో చైనా సైనికులు ఎంతమంది చనిపోయారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చైనా సైనికులు కూడా మరణించారని భారత మీడియాలో కథనాలు వచ్చాయి. సైన్యం కూడా ఇదే విషయం చెప్పుకొస్తోంది.
తాజాగా చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ మీడియా సమావేశంలో ఇదే ప్రశ్నను చైనా అధికారులను పీటీఐ వార్త సంస్థ జర్నలిస్టు అడిగేశారు. దీనిపై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి చావో లిజియాన్ స్పష్టతనివ్వలేదు. చనిపోయారనడానికి నా వద్ద సమాచారం ఏమీ లేదు. చర్చల ద్వారా వివాదం పరిష్కరించుకొని సరిహద్దుల్లో శాంతి నెలకొల్పుకుంటాం అని తెలిపారు.
చైనా సైనికులను భారత సైనికులే రెచ్చగొట్టి వారిపై దాడి చేశారని.. రెండు పక్షాల మధ్య హింసకు భారత సైనికులే కారణమని చావో లిజియాన్ మీడియా సమావేశంలో ఆరోపించారు. భారత్ తమ సైనికులను నిలువరించాలని సూచించారు. దీన్ని బట్టి చైనా అధికారికంగా చెప్పకపోయినా భారీగానే చైనా సైనికులు చనిపోయినట్టు.. ప్రాణ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. అమెరికా ఇంటెలిజెన్స్ తాజాగా 43మంది చైనా సైనికులు చనిపోయారని వెల్లడించింది. భారత సైన్యం కూడా అటూ ఇటూగా 40మంది వరకు చైనా సైనికులు ఈ ఘర్షణలో చనిపోయినట్టు వెల్లడించింది.