Begin typing your search above and press return to search.
చైనాలో రివర్సు సీన్.. పిల్లల్ని కంటే రూ.25 లక్షల అప్పు ఇస్తారట
By: Tupaki Desk | 25 Dec 2021 5:36 AM GMTప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం అన్నంతనే గుర్తుకు వచ్చేది చైనా. ప్రపంచంలో మరే దేశం కూడా భరించలేని భారీ జనాభాను మోస్తూ అభివృద్ధి పథంలోకి దూసుకెళ్లటం చైనాకు మాత్రమే సాధ్యమని చెప్పాలి. దీనికి తోడు అక్కడి నిబంధనలు.. అనుసరించే పద్దతలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఏదైనా పాలసీని ఎంత కఠినంగా అమలు చేస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా మహమ్మారి జన్మస్థలి చైనా కాబట్టి సరిపోయింది కానీ.. మరే దేశమైనా సరే అయితే.. ఇప్పటికి ఎంత రచ్చ జరిగేదో. కరోనా లాంటి దారుణమైన పరిస్థితులకు అసలు కారణం ఏమిటన్న విషయాన్ని నేటికి గుట్టుగా ఉంచగలిగిన సత్తా చైనా మాత్రమే.
ఇలాంటి దేశంలో గతానికి భిన్నమైన సీన్ కనిపిస్తోందని చెబుతున్నారు. భారీగా పెరిగిన జనాభా నేపథ్యంలో కుటుంబ నియంత్రణను కఠినంగా అమలు చేయటం తెలిసిందే. పిల్లల్ని కనే తల్లిదండ్రులకు దిమ్మ తిరిగే ఆంక్షలు అమలయ్యేవి. దీంతో.. పిల్లల్ని కనాలన్న ఆలోచనను చైనీయులు మర్చిపోయిన పరిస్థితి ఈ తీరు కొన్నేళ్లుగా సాగుతుండటంతో.. ఇప్పుడు చైనాలో కొత్త ఇబ్బందులు తెర మీదకు వస్తున్నాయి. ఒకప్పటి జనాభా విస్ఫోటనానికి భిన్నంగా ఇప్పుడు జనాభా తరగుదల మొదలైంది. దేశంలో యువత సంఖ్య తగ్గటం మొదలైంది.
దీంతో.. ముంచుకు రానున్న ప్రమాదాన్ని గుర్తించిన ప్రభుత్వం నివారణ చర్యలు షురూ చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుతం జిలిన్ ప్రావిన్సు (అంటే మన దేశంలో రాష్ట్రాల మాదిరి అన్న మాట) కొత్త పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. పెళ్లైన వారు పిల్లల్ని కనాలనుకుంటే మన రూపాయిల్లో రూ.25 లక్షల మొత్తాన్ని అప్పుగా ఇస్తామని ఊరిస్తోంది స్థానిక ప్రభుత్వం.
అంతేకాదు.. చిన్న వ్యాపారాలు నడిపే జంటలకు ఇద్దరు.. అంత కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండే వారి వ్యాపారాలకు విదించే పన్నుల్లో రాయితీతో పాటు మినహాయింపులు ఇస్తామని చెబుతున్నారు. ఇలాంటి ప్రోత్సహాకాలతో అయినా పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నారు. మరి.. ఒక ప్రావిన్సులో మొదలైన ఈ ప్రోత్సాహాకాలు రానున్న రోజుల్లో మరిన్ని ఫ్రావిన్సుల్లోనే ప్రకటించటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఒకప్పుడు పిల్లల్ని కంటే తాట తీస్తామంటూ పరిమితులు విధించిన చైనాలో ఇప్పుడు సీన్ రివర్సు అయ్యింది.