Begin typing your search above and press return to search.

అప్పుడే మన వ్యాక్సిన్స్ ను హాక్ చేస్తున్న చైనా !

By:  Tupaki Desk   |   1 March 2021 4:33 PM GMT
అప్పుడే మన వ్యాక్సిన్స్ ను హాక్ చేస్తున్న చైనా !
X
భారత్, చైనాల మధ్య బార్డర్లోనే కాకుండా ఇప్పుడు బయోవార్ కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా భారత్ పై చేయి సాధిస్తుండడంతో.. ఇప్పుడు చైనా ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు కుట్రలు పన్నుతున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల బార్డర్స్ నుంచి తమ సైనికులను వెనక్కి తెచ్చుకున్న చైనా.. ఇప్పుడు టెక్నికల్ గా దెబ్బతీయాలని చూస్తోంది. చైనాలోని ఓ హ్యాకింగ్ గ్రూప్ భారత్ లోని సీరమ్, భారత్ బయోటెక్ వివరాలను దొంగిలించేందుకు కుయుక్తులు పన్నుతున్నట్లు సమాచారం.

కరోనా వైరస్ ను నిరోధించేందకు ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ ను ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడవుతున్న టీకాల్లో భారత్ లో తయారైనవే 60 శాతం ఉన్నాయి. దీంతో భారత్ కు చెందిన వ్యాక్సిన్ వివరాలను దొంగిలించేందుకు ఆ సంస్థల కంప్యూటర్లలోకి మాల్ వేర్ ను పంపినట్లు సై ఫార్మా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సీరం ఇనిస్టిట్యూట్ లను క్లుణ్ణంగా పరిశీలిస్తోందని.. అనేక పబ్లిక్ సర్వర్ల సెక్యూరిటీ వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయని ఆయన అన్నారు.

అయితే ఈ విషయంపై అటు భారత్ గానీ.. ఇటు చైనా గానీ ఏ విధంగా స్పందించలేదు. ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాప్ట్ కూడా నవంబర్ లోనే ఇటువంటి దాడుల గురించి హెచ్చరించింది. రష్యా, ఉత్తర కొరియా కేంద్రంగా కొన్ని హ్యాకింగ్ గ్రూపులు భారత్, కెనడా, ఫ్రాన్స్ , అమెరికా దేశాలకు చెందిన ఫార్మా కంపెనీలను టార్గెట్ చేసుకున్నాయన్నారు.

తాజాగా హ్యాకింగ్ గ్రూప్ స్టోన్ పాండా చైనా అంతర్గత భద్రతా మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తోందని అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ 2018లోనే తెలిపింది. ఇదిలా ఉండగా గతేడాది ఫైజర్ టీకాకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు లీకయ్యాయని ఆ సంస్థ తెలిపింది. తాజాగా చైనా హ్యకింగ్ గ్రూప్ స్టోన్ పాండా.. భారత్ లో వ్యాక్సిన్ ఉత్పత్తి దారులైన సీరం, భారత్ బయోటెక్ ఐటీ వ్యవస్థల్లోని లోపాలను గుర్తించి మాల్ వేర్ చొప్పించారని సదరు సంస్థ పేర్కొంది.