Begin typing your search above and press return to search.

షాకింగ్ : చైనా మ్యాప్ లో అరుణాచల్ ప్రదేశ్ !

By:  Tupaki Desk   |   22 April 2020 11:10 AM GMT
షాకింగ్ :  చైనా మ్యాప్ లో అరుణాచల్ ప్రదేశ్ !
X
మన సరిహద్దు దేశం చైనా మరోసారి తన వక్రబుద్ధిని చూపెట్టింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ దేశంలో అంతర్భాగమని పదే పదే వివాదాస్పద ప్రకటనలు చేస్తున్న చైనా తాజాగా విడుదల చేసిన మ్యాప్ ‌లో అరుణాచల్‌ లోని కొన్ని భూభాగాలను నిక్షిప్తం చేసింది. తాజా చైనా కొత్త మ్యాప్‌ ను స్కై మ్యాప్‌ విడుదల చేసింది.స్కై మ్యాప్‌ చైనా డిజిటల్‌ మ్యాప్‌ల సాధికారిక సంస్థ. ఈ సంస్థ బీజింగ్‌ నేషనల్‌ సర్వేయింగ్‌ అండ్‌ మ్యాపింగ్‌ జియోగ్రఫిక్‌ ఇన్‌ ఫర్మేషన్‌ బ్యూరో ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ టిబెట్‌ సరిహద్దుల్లో ఉన్న ఈశాన్య రాష్ట్రం 1913-14 వరకూ బ్రిటిష్‌ ఇండియాలో భాగము.

మెక్‌ మోహన్‌ రేఖ ఏర్పాటు అయ్యే వరకూ భారత్‌, టిబెట్‌ ల మధ్య సరిహద్దుగా1938లో ఉండేది. చైనా టిబెట్‌ ను1951లో ఆక్రమించుకుంది. చైనా మ్యాప్‌ 1989 ఎడిషన్‌ మ్యాప్‌ ఆధారంగా రూపొందించారు. చైనాకు రష్యా, మధ్య ఆసియా దేశాలతోనూ సరిహద్దు సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించు కుంది. కానీ అరుణాచల్‌ ప్రదేశ్‌ ను వివాదాస్పద ప్రాంతంగా వదిలేసింది.

చైనా టిబెట్‌ నే కాదు, 37,000 చదరపు కిలోమీటర్ల ఆక్సాయ్‌ చిన్‌ ప్రాంతాన్ని కూడా ఆక్ర మించుకుంది. ఇది జమ్ము - కాశ్మీర్‌ పూర్వపు రాష్ట్రంలో అంతర్భాగం. జనావాసం లేని ఏడారి ప్రాంతం చైనాలోని గ్జిన్జియాంగ్‌ రాష్ట్రానికి సరిహద్దులో ఉంది. 1951 లో టిబెట్ ను ఆక్రమించుకున్న చైనా అప్పటి నుండి అరుణాచల్‌ ప్రదేశ్ కూడా టిబెట్ లో భాగమని వాదిస్తుంది. భారత భూభాగంలో కి అక్రమంగా సైన్యాన్ని పంపిస్తుంది.