Begin typing your search above and press return to search.

భార‌త్ - చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌!

By:  Tupaki Desk   |   3 Nov 2016 4:44 PM GMT
భార‌త్ - చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌!
X
ఓప‌క్క భార‌త్ - పాకిస్థాన్ స‌రిహ‌ద్దు ప్రాంతంలో ఉద్రిక్త కొన‌సాగూ ఉంటే... ఇంకోప‌క్క చైనా స‌రిహ‌ద్దు ప్రాంతంలో కూడా ప‌రిస్థితి కాస్త వేడెక్కుతోంది. వాస్త‌వాధీన రేఖ ప్రాంతం వ‌ద్ద భార‌త్ - చైనా ద‌ళాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. లెహ్ జిల్లా డెమ్ చోక్ సెక్టార్ ప్రాంతంలోని భార‌త భూభాగంలోకి చైనా ఆర్మీ దూసుకొచ్చే ప్ర‌య‌త్నం చేసింది. చైనా లిబ‌రేష‌న్ ఆర్మీకి చెందిన 55 మంది జ‌వాన్లు భార‌త స‌రిహ‌ద్దుల్లోకి చొచ్చుకుని రాబోతుంటే.. భార‌త సైన్యం వెంట‌నే స్పందించి వారిని ఎదుర్కొంది. భార‌త జ‌వాన్లు - ఐ.టి.బి.పి. ద‌ళాలు చైనా సైనికుల‌ను ఇంచైనా క‌ద‌ల‌కుండా నిల‌బెట్టేశాయి.

ఎంత‌గా నిల‌బెట్టేశాయంటే.. చైనా సైనికులు ఒక్క అంగుళ‌మైనా ముందుకు క‌దిలే అవ‌కాశం లేకుండా! బుధ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి చైనా ఆర్మీకి ఎదురుగా భార‌త సైనికులు నిల‌బ‌డే ఉన్నారు. దీంతో అక్క‌డి ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇంత‌కీ, చైనా సైనికులు ఎందుకు దూసుకొచ్చారంటే... భార‌త భూభాగంలో నిర్మిస్తున్న నీటి పారుద‌ల కాల్వ నిర్మాణాన్ని అడ్డుకోవ‌డానికి. కాలువ నిర్మిస్తున్న భూభాగం చైనాకు చెందింద‌నీ, ఈ నిర్మాణ ప‌నుల‌ను వెంట‌నే ఆపేయాలంటూ లిబ‌రేష‌న్ ఆర్మీ ఆరోపిస్తోంది. రెండు దేశాల అంగీకారంతోనే ఆ ప్రాంతంలో కాలువ నిర్మించాల‌ని చైనా ద‌ళాలు అభిప్రాయ‌ప‌డ్డాయి. చైనా ద‌ళాలు చేస్తున్న ఈ ఆరోప‌ణ‌ల్ని భార‌త బ‌ల‌గాలు ఏమాత్రం ప‌ట్టించుకోలేదు. దీంతో అక్క‌డ ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు దేశాల‌కు చెందిన బోర్డుల‌ను ఇరు దేశాల సైనికులూ పీకేశారు. ఆ త‌రువాతి నుంచి రెండు దేశాల ద‌ళాలు ఒక‌రికి ఒక‌రు ఎదురుగా నిల్చుని ఉన్నాయి. బుధ‌వారం మధ్యాహ్నం నుంచీ ఇదే ప‌రిస్థితి.

కాలువ నిర్మిస్తున్న ప్రాంతం లెహ్ కు 250 కి.మీ. దూరంలో ఉంది. ఈ ప్రాంతానికి మ‌న సైన్యం త్వ‌ర‌గా చేరుకునేందుకు కాలువ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. చైనా ద‌ళాల‌ను నిలువ‌రించాలంటే మ‌న‌దేశానికి ఇది చాలా ముఖ్య‌మైన ప్రాంతం. గ‌తంలో, అంటే 1959లో మ‌న‌దేశానికి చెందిన 10 మంది బి.ఎస్‌.ఎఫ్‌. జ‌వాన్ల‌ను చైనా పొట్ట‌న‌పెట్టుకుంది కూడా ఇక్క‌డే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/