Begin typing your search above and press return to search.
పట్టు బిగించిన జిన్‌పింగ్.. చైనాకు ఆయనే సారథి!!
By: Tupaki Desk | 22 Oct 2022 2:30 PM GMTడ్రాగన్ కంట్రీ చైనా సారథిగా మళ్లీ జిన్‌పింగే పగ్గాలు చేపట్టనున్నారు. నిజానికి ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ.. ఆయన వ్యతిరేకులు అందరినీ ముందుగానే.. పక్కన పెట్టేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ తనకే చైనా పగ్గాలు అప్పగించేలా.. వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. దీంతో విధిలేని పరిస్థితిలో చైనా పాలకుడిగా.. ఆయన నియామకం.. తప్పని సరి అయిందని ప్రపంచ మీడియా గగ్గోలు పెగుతుండడం గమనార్హం.
చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ మహాసభలు తాజాగా(శనివారం ఉదయం 11 గంటలకు) ముగిశాయి. ఆ దేశ అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి షీ జిన్పింగ్కు పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఆదివారం స్టాండింగ్ కమిటీ.. ఆయన పేరును అధికారికంగా ప్రకటించనుంది. మరోవైపు, ఇదివరకు స్టాండింగ్ కమిటీలో ఉన్న చైనా ప్రీమియర్ లీ కెకియాంగ్తో పాటు మరో ముగ్గురు నేతలకు జిన్పింగ్ ఉద్వాసన పలికారు.
మావో జెడాంగ్ తరవాత తిరిగి అంతటి శక్తిమంతుడైన అధినాయకుడిగా షీ జిన్‌పింగ్‌ను ప్రతిష్ఠించడమే ప్రధాన అజెండాగా సాగిన చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) 20వ జాతీయ మహాసభలు ఆద్యంతం జన్‌పింగ్ కనుసన్నల్లోనే సాగాయి.
ఆయనమాటే శాసనం అన్నట్టుగా సాగిన ఈ సమావేశాలు.. గత ఆదివారం రాజధాని బీజింగ్లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్లో ప్రారంభమయ్యాయి. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి 2,300 మంది హాజరైన ఈ సమావేశాల్లో.. 370 మంది సభ్యులతో కూడిన సెంట్రల్ కమిటీని ఎన్నుకున్నారు.
అయితే ఈ సెంట్రల్ కమిటీ.. ఆదివారం మరోసారి సమావేశమై 25 మంది నాయకులతో పొలిటికల్ బ్యూరోను ఎన్నుకోనుంది. అనంతరం ఈ పొలిటికల్ బ్యూరో.. ఏడుగురు సభ్యులతో కూడిన స్టాండింగ్ కమిటీని ఎన్నుకోనుంది. ఆ తర్వాత శక్తిమంతమైన స్టాండింగ్ కమిటీ.. జనరల్ సెక్రటరీ( పార్టీ అధ్యక్షుడు) పేరును ప్రకటించనుంది. ఇప్పటికే జిన్పింగ్కు మూడోసారి పగ్గాలు అప్పగించేందుకు సెంట్రల్ కమిటీ ఆమోదించింది. ఈ మేరకు ఆదివారం అధికారికంగా ప్రకటన చేయడమే తరువాయి.. !!
పార్టీతో పాటు ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించిన జిన్పింగ్ వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. 2018లో పార్టీ రాజ్యాంగాన్ని సవరించిన జిన్ పింగ్, ఒక వ్యక్తి రెండుసార్లు కన్నా ఎక్కువ సార్లు అధ్యక్షుడి పదవిని చేపట్టేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.