Begin typing your search above and press return to search.

చైనా డైరెక్షన్ ..పాకిస్థాన్ యాక్షన్!

By:  Tupaki Desk   |   26 Sep 2020 12:10 PM GMT
చైనా డైరెక్షన్ ..పాకిస్థాన్ యాక్షన్!
X
గత కొన్ని రోజులుగా భారత్ , చైనా మధ్య సరిహద్దు వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గాల్వానా ఘటన తర్వాత భారత్ చైనా పై తగిన విధంగా ప్రతీకారం తీర్చుకుంటుంది. అయితే , చైనా భారత్ ను డైరెక్ట్ గా దెబ్బ కొట్టలేక , పాకిస్థాన్ తో కుమ్మకై ప్రతీకార చర్యలకి పాల్పడుతుందని నిఘా వర్గాల సమాచారం. జమ్మూ కాశ్మీర్ లో పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని రహస్యంగా చేరవేయాలని, భారత వ్యతిరేక కార్యకలాపాలను ఉధృతం చేయాలని చైనా, పాక్ ఐ ఎస్ ఐ ని ఆదేశిస్తోందని, దీనితో ఆ సంస్థ ఈ లోయలో దొంగచాటుగా ఉగ్రవాదులను పంపడం, ఆయుధాల చేరవేత వంటివాటికి పాల్పడుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.

జమ్మూ కాశ్మీర్ లో అస్థిరతను సృష్టించాలంటే ఈ పని చేయక తప్పదని చైనా తన ప్లాన్ ని పాకిస్థాన్ కు చెప్తుందట, ఇటీవల ఈ కేంద్రపాలిత ప్రాంతంలో భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు చాలావాటిలో చైనా మేడ్ మార్కింగులు ఉండడమే దీనికి సాక్ష్యం అని ఇంటిలిజెంట్స్ వర్గాలు చెప్తున్నాయి. ఫిరోజ్ పూర్ నుంచి ఆఖ్ నూర్ వరకు ఈ మధ్య మన జవాన్లు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు ఇవి చైనాలో తయారైనవని చెప్పకనే చెప్పాయి. రెండు రోజుల క్రితం పాకిస్తాన్ డ్రోన్ల ద్వారా జారవిడిచిన అసాల్ట్ రైఫిల్స్, మ్యాగజైన్స్, పలు తూటాలు చైనా మేడ్ వని స్పష్టంగా వెల్లడయింది.ఆర్మీ చీఫ్ నరవాణే, బీ ఎస్ ఎఫ్ చీఫ్ రాకేష్ ఆస్తానా, సీ ఆర్ఫీ ఎఫ్ అధికారి ఏ.పి. మహేశ్వరి గత 10 రోజులుగా వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న తాజా పరిస్థితిని సమీక్షించారు.