Begin typing your search above and press return to search.
ప్రపంచం యావత్తూ అసహ్యించుకుంటున్న సెల్ఫీ
By: Tupaki Desk | 11 Sep 2015 4:59 AM GMTఫోటోల పిచ్చి పోయి.. సెల్ఫీల స్వార్థం ఈ మధ్య ఎక్కువైంది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా సెల్ఫీల మోజు పిచ్చి స్థాయిని దాటిపోయింది. సెల్ఫీల మోజులో ఇప్పటికే పలువురు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరికొందరు విమర్శలకు గురయ్యారు.
కానీ.. సెల్ఫీని ప్రపంచం యావత్తూ తీవ్రంగా అసహ్యించుకున్న ఘటన తాజాగా చోటు చేసుకుంది. సెల్ఫీల పైత్యానికి పరాకాష్ఠగా నిలిచే ఈ ఘటన విన్నవారంతా షాక్ అయిపోతున్నారు. ప్రేమ ముదిరితే పిచ్చిగా మారుతుందని.. స్వార్థం ముదిరితే సెల్ఫీగా తయారవుతుందంటూ జోక్ గా చెప్పుకునే మాటలో ఎంత నిజం ఉందో తాజా ఘటన చెబుతుంది.
చైనాలోని బీజింగ్ పట్టణానికి చెందిన కిన్ అనే యువకుడు ఉన్నాడు. వాడికి కాస్తంత తిక్క ఎక్కువే. వాడిలో ఏం నచ్చిందో కానీ.. ఒకమ్మాయి వాడికి మనసిచ్చింది. అతగాడి చేష్టల్ని భరించింది. అధిక్యతను ప్రదర్శిస్తే సర్లేనని సర్దుకు పోయేది. అతగాడిని భరించేది. మరి.. అతగాడిలో ఏ ప్రేమను చూసి అతడ్ని అంతగా ప్రేమించిందో కానీ.. అదే పాడు ప్రేమ ఆమె ప్రాణాల్ని తీసింది.
ప్రేమికుల మధ్య గొడవ మొదలు కావటం.. అది కాస్తా పెద్దది అయ్యింది. ప్రియురాలి మీద కిన్ చేయి చేసుకున్నాడు. తగలరాని చోట దెబ్బ తగలటంతో ప్రాణాలు కోల్పోయింది. జరిగిన దానికి బాధ ఉందో లేదో కానీ.. ఆమె మృతదేహాన్ని అందంగా అలంకరించి.. పక్కనే పడుకొని ఆమెతో కలిపి సెల్ఫీ దిగిన లీన్ తన సెల్ఫీని పోస్ట్ చేశాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ దారుణం.. కాస్త ఆలస్యంగా ప్రపంచానికి తెలిసింది.
విషయం తెలిసిన ప్రతిఒక్కరూ లిన్ సెల్ఫీని చూసి అసహ్యించుకుంటున్నాడు. తన మానసికపరిస్థితిని చెప్పకనే చెప్పేస్తే.. ప్లీజ్ పర్ గివ్ మై సెల్ఫిష్ లవ్ అంటూ వ్యాఖ్య రాసి మరీ తన దర్మార్గ సెల్ఫీని పోస్ట్ చేశాడు. ప్రపంచం మొత్తం ఇతగాడి సెల్ఫీని అసహ్యించుకుంటే.. చైనా పోలీసులు అతగాడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.