Begin typing your search above and press return to search.

ఇక యుద్ధ‌మే..ఇండియా ఓట‌మికి రెడీగా ఉండు

By:  Tupaki Desk   |   21 July 2017 12:58 PM GMT
ఇక యుద్ధ‌మే..ఇండియా ఓట‌మికి రెడీగా ఉండు
X
దేశభద్రతకు సవాల్ విసురుతూ, భారత్-భూటాన్- చైనా ట్రైజంక్షన్ రూపురేఖలు ఏకపక్షంగా మార్చేందుకు చైనా ప్రయత్నిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం స్పందించిన తీరుపై చైనా మండిప‌డింది. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ వివరణ ఇస్తూ.. భారత్-చైనా-భూటాన్ దేశాల సరిహద్దు విషయమై మూడు దేశాలు ఉమ్మడిగా నిర్ణయించేలా 2012లో లిఖితపూర్వక ఒప్పందం జరిగిందని వెల్లడించారు. ``భారత్-చైనా మధ్య హద్దులు ఖరారు కావాలి. ద్వైపాక్షిక చర్చల ద్వారానే వాటిని నిర్ణయించాలి. అలాగే చైనా - భూటాన్ సరిహద్దు కూడా ఆ రెండు దేశాలు చర్చల ద్వారా నిర్ణయించాలి. అయితే, డోక్లాం ట్రైజంక్షన్ మూడుదేశాలతో ముడిపడిన వ్యవహారం కాబట్టే భారత్ సీరియస్‌ గా తీసుకుంటోంది. దీన్ని తేలిగ్గా వదిలేస్తే రక్షణ పరమైన ఇబ్బందులు తలెత్తుతాయి`` అని సుష్మ వివరించారు.

మ‌న ప్ర‌భుత్వ స్పంద‌న‌పై చైనా త‌ర‌ఫున ఆ దేశ అధికారిక పత్రిక గ్లోబ‌ల్‌ టైమ్స్ హెచ్చ‌రిక‌లు జారీచేసింది. ఒక మహిళా మంత్రి అంటూ ప‌రోక్షంగా సుష్మాస్వ‌రాజ్‌ ను ప్ర‌స్తావించిన గ్లోబ‌ల్ టైమ్స్ ఆ నాయ‌కురాలు అబ‌ద్దాలు మాట్లాడార‌ని ఆక్షేపించింది. త‌మ‌ను త‌ప్పుప‌డుతున్న భార‌త్ కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏ ఒక్క దేశం కూడా మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌ని ఎద్దేవా చేసింది. సరిహద్దు విషయంలో భారత్‌ కు జపాన్ వంటి దేశాల నుంచి మద్దతు లభించదని జోస్యం చెప్పింది. హిందూ మహా సముద్రం ద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామని భారత్ అనుకుంటే అది అమాయకత్వమేనని వ్యాఖ్యానించింది. ఇప్ప‌టికే భార‌త్‌లో భ‌యం క‌నిపిస్తోంద‌ని చైనా త‌ర‌ఫున గ్లోబ‌ల్ టైమ్స్‌ ఎద్దేవా చేసింది. రెండు దేశాలు త‌మ త‌మ సైన్యాన్ని వెన‌క్కు తీసుకుందామ‌ని భార‌త్ చేసిన‌ సామ‌ర‌స్య పూర్వ‌క ప్ర‌స్తావ‌న‌ను సైతం చైనా ఎద్దేవా చేసింది. ఈ పిలుపుతో భార‌త్‌లో భ‌యం ఉన్న‌ట్లుగా తేలిపోయింద‌న్నారు.

డోక్లాం జంక్ష‌న్ నుంచి భార‌త్ వెన‌క్కు త‌గ్గాల్సిందేన‌ని ఆదేశించింది. అలా త‌గ్గ‌ని క్ర‌మంలో త‌మ‌కు ఉన్న ఏకైక ఆప్ష‌న్ యుద్ధం చేయ‌డ‌మేన‌ని తెలిపింది. భారత్‌ ను దెబ్బతీసేందుకు తమ వద్ద చాలా మార్గాలు ఉన్నాయని హెచ్చరించింది. త‌మ సైన్యం త‌క్కువ‌గా ఉంద‌ని భార‌త్ భావించ‌వ‌ద్ద‌ని....అవ‌స‌ర‌మైతే త్వ‌ర‌గా ఆ సామ‌ర్థ్యం పెంచుకోగ‌ల సత్తా చైనా సొంత‌మ‌ని అన్నారు. డోక్లాం జంక్ష‌న్ చైనా సొంత‌మ‌ని ఆ ప్రాంతం నుంచి ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు విరుద్ధంగా త‌మ ఆర్మీ వైదొల‌గ‌ద‌ని విశ్లేషించింది. 1962 యుద్ధాన్ని ప్ర‌స్తావిస్తూ అలాంటి త‌ప్పిదాన్ని మ‌రోమారు ఇండియా చేయ‌బోద‌ని భావిస్తున్న‌ట్లు గ్లోబ‌ల్ టైమ్స్ తెలిపింది.