Begin typing your search above and press return to search.
సంచలనం : చైనామొబైల్ సర్వీసులపై బ్యాన్
By: Tupaki Desk | 4 July 2018 5:07 AM GMTసంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎవరి మీదనైనా సరే.. ఇట్టే విరుచుకుపడే తీరున్న ట్రంప్.. తాజాగా చైనా మొబైల్ సర్వీసులపై నిషేధాన్ని విధించటం ద్వారా ఊహించని రీతిలో షాకిచ్చారు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంతో అమెరికాలో చైనా మొబైల్ సర్వీసుల్ని బ్లాక్ అయిపోయాయి.
అమెరికా టెలి కమ్యునికేషన్ మార్కెట్‌కు చైనా మొబైల్ సర్వీసుల్ని ఆఫర్ చేసే సంస్థలపై నిషేధం విధించినట్లైంది. ఈ నేపథ్యంలో చైనా మొబైల్ యూఎస్ లో ఆపరేట్ చేయటానికి వీల్లేకుండా పోయింది. నేషనల్ టెలికమ్యునికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసిన ప్రకటనలో ఫెడరల్ కమ్యునికేషన్స్ కమిషన్ కు చైనా మొబైల్ ను అనుమతించకూడదన్న సూచన చేసింది.
గడిచిన కొన్ని నెలలుగా చైనా.. అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం ఓ రేంజ్లో సాగుతోంది. ట్రంప్ విధించిన నిషేధంతో ప్రపంచంలో పెద్ద కంపెనీల్లో ఒకటైన చైనా మొబైల్ సంస్థ భారీ దెబ్బ తగిలినట్లుగా చెప్పాలి. చైనా టెక్ కంపెనీలు తమ మేథోసంపత్తి హక్కుల్ని దొంగలిస్తున్నాయని ట్రంప్ తీవ్ర విమర్శలు చేయటం తెలిసిందే.
తాజా నిషేధంపై వివరణ ఇస్తూ.. అమెరికా భద్రతకు ముప్పు అన్న విషయాన్ని అమెరికా అథారిటీలు చెబుతున్నాయి. చైనా మొబైల్ దోపిడీకి దారి తీసే అవకాశం ఉందని.. ఆ సంస్థ చైనా ప్రభుత్వ చెప్పుచేతుల్లో నడుస్తోందని చెబుతున్నారు. చైనా మొబైల్ కార్యకలాపాలు పెరిగితే.. అమెరికా న్యాయవ్యవస్థకు ప్రమాదాలు పెరుగుతాయని.. దేశ ప్రయోజనాల్ని కాపాడుకోలేమని అమెరికా కామర్స్ కమ్యూనికేషన్స్ కు చెందిన కీలక అధికారి డేవిడ్ రెడ్ల్ చెప్పటం గమనార్హం. తాజా పరిణామాలపై బీజింగ్ ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.