Begin typing your search above and press return to search.

కరోనాను మేం ఇలా కట్టడి చేశాం: చైనా

By:  Tupaki Desk   |   26 March 2020 10:45 AM GMT
కరోనాను మేం ఇలా కట్టడి చేశాం: చైనా
X
కరోనా వైరస్.. చైనాలోని వూహాన్ లో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని పీక్కుతింటోంది. అందరూ ఇది చైనా సృష్టి అని ఆదేశంపై ఆడిపోసుకుంటున్నారు. దీనిపై తాజాగా ఇండియాలోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి జీ రాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిప్పుడు వైరల్ గా మారాయి.

తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దేశంలో కరోనా వ్యాపిస్తుండడంతో దీన్ని ‘చైనీస్ వైరస్’ అంటూ విమర్శించారు. దీనిపై ఇండియాలో ఉన్న చైనా ప్రతినిధి స్పందించారు. మా దేశాన్ని విమర్శించే ముందు తాము ఈ వైరస్ ఎలా విజయం సాధించామో అంతర్జాతీయ దేశాలు గమనించాలని హితవు పలికారు.

కరోనా వైరస్ ను తాము సృష్టించలేదని.. కావాలనే వ్యాప్తి చెందింపజేయలేదని.. అసలీ వైరస్ ఎక్కడ పుట్టిందనే దానిపై శాస్త్రీయ పరిశోధనలు జరగాలని చైనా అధికార ప్రతినిధి జీ రాంగ్ డిమాండ్ చేశారు.

చైనాకు మాస్కులు - వైద్య పరికరాలు పంపి భారత్ సాయం చేసిందని.. భారత్ కు కృతజ్ఞత తెలుపుతున్నామని జీరాంగ్ తెలిపారు. మా దేశ త్యాగనిరతిని ప్రపంచదేశాలు గుర్తించాలని కోరుతున్నామన్నారు. విమర్శలు మానాలని కోరారు. చైనాలో కరోనాపై యుద్ధం ప్రకటించి కట్టడి చేశామని.. ఇప్పుడు మరణాలు తగ్గాయన్నారు. మా చర్యలను స్ఫూర్తిగా తీసుకోవాలని హితవు పలికారు.