Begin typing your search above and press return to search.
చైనా మరో చోట మనల్ని కెలుకుతోంది
By: Tupaki Desk | 19 Sep 2017 6:01 AM GMTపక్కనే ఉన్నప్పటికీ పక్కలో బల్లెం లాంటి రాజకీయాలకు పాల్పడుతున్నా చైనా మరో రూపంలో భారతదేశాన్ని కెలుకుతోంది. కొద్దికాలం క్రితం నేరుగా ఎంట్రీ ఇచ్చిన చైనా భారత్ ప్రతిఘటన దాటికి తట్టుకోలేక తోకముడిచిన సంగతి తెలిసిందే. బ్రిక్స్ సమ్మిట్‌లో కూడా భారత్ వ్యూహాలకు బిత్తరపోయింది. అయితే ఇప్పుడు మరో రూపంలో చైనా ఎంట్రీ ఇస్తోంది. నేపాల్ సరిహద్దుతో కలిసే కీలకమైన రోడ్డు మార్గాన్ని చైనా ప్రారంభించిందని ఆ దేశ మీడియా వెల్లడించింది.
టిబెట్ లోని జిగాజే ఎయిర్ పోర్టు, జిగాజే నగరం మధ్య 40.4 కిలోమీటర్ల ప్రధాన రహదారిని పౌర, సైనిక అవసరాలకు ఉపయోగించే అవకాశాలున్నాయని, ఈ మార్గంవల్ల దక్షిణాసియా చైనాకు అందుబాటులోకి వస్తుందని అధికారపత్రిక గ్లోబల్ టైమ్స్ రాసింది. చైనా ఆర్థిక రాజధాని షాంఘై నగరాన్ని నేపాల్ సరిహద్దుల్లోని జాంగ్‌మూను ఈ రోడ్డు కలుపుతుంది. అంతేకాకుండా టిబెట్ లోని రైల్వేలైనుకు కూడా ఇది సమాంతరంగా సాగుతుంది. దీనివల్ల వాణిజ్యపరంగానే కాకుండా సైనిక విస్తరణపరంగా దక్షిణాసియా చైనాకు చేరువ అవుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. జీ-318 రహదారి జిగాజేకు చేరుకుంటుంది. అటునుంచి ఓ పాయ నేపాల్ కు వెళ్తుంది. మరోపాయ అరుణాచల్ సరిహద్దుల్లోని నింగ్చీకి వెళ్తుంది. చైనా నిర్మించే రహదారులన్నీ అధునాతనమైనవని, వాటిని పౌరరవాణాతోపాటుగా సైనిక అవసరాలకు ఉపయోగించుకోవచ్చని అంటున్నారు. రోడ్లపై భారీసైనిక వాహనాలను తిప్పేందుకు, అవసర సమయాల్లో రక్షణ విమానాలను దింపేందుకు వీలుండడమే దీనికి కారణం.
నేపాల్ కు రోడ్డు సౌకర్యం మెరుగుపర్చేందుకు చైనా ఆగమేఘాల మీద కృషి చేస్తోంది. అయితే దీని వెనుక చైనా స్వార్థ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయనేది తేటతెల్లం అవుతుండటంతో నమ్మబలికే ప్రయత్నం చేస్తోంది. భారత్ అంగీకరిస్తే భవిష్యత్తులో ఈ రహదారిని భారత్ - భూటాన్ - బంగ్లాదేశ్ ల వరకూ విస్తరించవచ్చునని, ఇదో వాణిజ్య కారిడార్ లాగా మారుతుందని చైనా చెబుతోంది. ఇప్పటిదాకా భారత్ కు సన్నిహిత దేశంగా ఉన్న నేపాల్‌ను తనవైపు తిప్పుకోవడం, సరిహద్దులో మౌలిక సదుపాయాల్ని బలోపేతం చేసుకోవడం ద్విముఖ లక్ష్యాలుగా హైవే - రైల్వే ప్రాజెక్టుల్ని చైనా చేపట్టినట్లు తెలుస్తోంది. కాగా, మాధేసీ ఆందోళన సందర్భంగా చైనా అనుకూల నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ భారత్ మీద ఎక్కువగా ఆధారపడకూడదనే ఉద్దేశంతో చైనాతో సరిహద్దు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. కె.పి.శర్మ ఓలీ చైనాకు అనుకూలుడు. నేపాల్ లో మాధేసీల ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న రోజుల్లో.. భారత వస్తువులు నేపాల్ లో ప్రవేశంపై దిగ్బంధం కొనసాగుతున్న సమయంలో.. చైనా వస్తువుల రవాణాకు మార్గం సుగమం చేయడం, భారత్ పై ఆధారపడటాన్ని తగ్గించడం కోసం శర్మఓలి చైనాతో ఒప్పదం చేసుకున్నారు. అయితే ఓలీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత చైనా దూకుడు కొంత తగ్గింది. కాగా ఇప్పుడు తాజాగా ఈ రూపంలో ఎంట్రీ ఇస్తోంది.