Begin typing your search above and press return to search.

చైనావోడు మామూలోడు కాదు బాసూ.. ఈ ప్రాజెక్టు గురించి తెలిస్తే అవాక్కే

By:  Tupaki Desk   |   23 Aug 2021 5:37 AM GMT
చైనావోడు మామూలోడు కాదు బాసూ.. ఈ ప్రాజెక్టు గురించి తెలిస్తే అవాక్కే
X
మనకు చైనాకు తేడా ఏముంది? మనం కష్టపడతాం. వాళ్లు కష్టపడతామని చెబుతారు. కానీ.. వారి విజన్ ఆ దేశాన్నిఎక్కడికో తీసుకెళ్లిపోతుందని చెప్పాలి. మిగిలిన దేశాలతో లొల్లిపెట్టుకోవటం లాంటివి చైనా అంటే పాజిటివ్ గా ఫీల్ కానివ్వవు కానీ.. తమ దేశం.. తమ ప్రయోజనాలు తప్పించి.. మిగిలినవారి గురించి అస్సలు పట్టించుకోని వీరు తీరు కాస్త భిన్నమని చెప్పాలి. మిగిలిన ప్రపంచమంతా రానున్న కొన్ని సంవత్సరాల్లో షురూ చేయాలనుకుంటే.. చైనా వోడు మాత్రం అందుకు భిన్నంగా ఇప్పుడు ఏకంగా పనే మొదలెట్టేసిన తీరు చూస్తే.. మనకు వాళ్లకుఉన్న తేడా ఏమిటో అర్థం కాక మానదు.

తాజాగా ఒక వినూత్న ఆలోచన మీద ప్రపంచంలోని అగ్రరాజ్యాలు వర్కువుట్ చేస్తుంటే.. చైనా మాత్రం ఏకంగా పనిలోకే దిగేసింది. ఇంతకీ ఆ ప్రాజెక్టు మరేమిటో కాదు.. ఆకాశం నుంచి విద్యుత్ ను జనరేట్ చేయటం. ఇప్పటివరకు ఈ అంశంపై ఆలోచనలే తప్పించి.. వాస్తవంగా వర్కువుట్ అవుతుందా? ఎంతమేర సక్సెస్ అవుతామన్న అనుమానాలు ఉన్న సమయానికి.. చైనా తన ప్రాజెక్టును పట్టాలకు ఎక్కించేసింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో.. రానున్నరోజుల్లో విద్యుత్ కీలక ఇంధనంగా మారనుంది. నిత్యవసరాలు మొదలు వాహనాల వరకు ఏది పని చేయాలన్నా విద్యుత్ కీలకంగా మారనుంది. మరి..భారీగా పెరిగే వినియోగానికి తగ్గట్లు.. ఉత్పత్తి ఉండాలి కదా? గాలి నుంచి.. నీటి నుంచి.. బొగ్గు నుంచి ఇలా ప్రతిదాని నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నా.. వినియోగ డిమాండ్ కు తగ్గట్లు పెంచటం ఇబ్బందికరంగా మారింది. దీంతో.. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు కొత్త ఉత్పత్తి మార్గాల్ని వెతుకుతున్నాయి ప్రపంచ దేశాలు. ఇప్పుడున్న మార్గాల్లో ఉన్న ప్రతికూలతల నేపథ్యంలో నిరంతరం విద్యుత్ ఉత్పత్తికి మార్గాల్ని అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలకు అంతరిక్షం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయటం ఒక మార్గంగా మారింది.

అంతరిక్షంలో ఉపగ్రహాల తరహాలో భారీ సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేయొచ్చని ప్రతిపాదించారు. జపాన్.. యూరోపియన్ యూనియన్ లు ఈ దిశగా పరిశోధనలు చేస్తున్నవేళ.. చైనా మాత్రం ఏకంగా రంగంలోకి దిగింది. అంతరిక్షంలో అత్యంత భారీ సోలార్ ప్రాజెక్టుల్ని చేపట్టింది. ఈ తరహా విద్యుత్ ను 2035 నాటికి తయారు చేసే అవకాశం ఉందని చెబుతోంది. ఇది అత్యంత చౌకనదిగా చెబుతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం వెయ్యి యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం అణు విద్యుత్ ప్లాంట్లలో రూ.5వేలు ఖర్చు అయితే.. సౌర.. పవన విద్యుత్ ప్లాంట్లలో రూ.3750 ఖర్చు అవుతోంది. అదే స్పేస్ సోలార్ ప్లాంట్ లో కేవలం రూ.385 మాత్రమే ఖర్చు అవుతుందని లెక్క కడుతున్నారు.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ ఐడియాకు స్ఫూర్తి రష్యన్ రచయిత ఐజాక్ అసిమోవ్ అనే అతనను తన ఫిక్షన్ నవలలో స్పేస్ సోలార్ పవర్ స్టేషన్ల గురించి రాశాడు. గతంలోనే దీని గురించి మాట్లాడుకున్నా.. ఖర్చు దగ్గర ఆగిపోయారు. ఈ మధ్య కాలంలో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావటంతో.. ఇప్పుడీ ఆలోచనను ఆచరణలోకి తీసుకొస్తున్నారు.

ఇంతకీ ఈ ప్రాజెక్టు ఎలా పని చేస్తుందంటే.. భూమి నుంచి 23 వేల కిలోమీటర్ల ఎత్తున భారీ సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తారు. ప్యానెల్స్ సూర్యరశ్మిని గ్రహించి విద్యుత్ గా మారుస్తాయి. సోలార్ ప్యానెల్స్ ద్వారా వచ్చిన విద్యుత్ ను మైక్రో తరంగాలుగా లేదంటే.. లేజర్ కాంతిగా మార్చి భూమిపై ఏర్పాటు చేసిన రిసీవర్లకు పంపుతారు. భూమి మీద ఉన్న రిసీవర్లు వాటిని గ్రహించి తిరిగి విద్యుత్ గా మారుస్తాయి. ఆ కరెంటును గ్రిడ్ల లైన్ల ద్వారా సరఫరా చేస్తారు.

అయితే.. వినేందుకు బాగాSpace Solar Stationనే ఉన్నా.. కొన్ని సవాళ్లు లేకపోలేదు. ఒకవేళ స్పేస్ సోలార్ స్టేషన్ లో ఏదైనా సమస్య వచ్చి.. అది భూమిపైకి పంపే మైక్రోవేవ్లు ప్రజలు ఉండే ప్రాంతాలపై పడితే పరిస్థితి ఏమిటి? అన్నది ఒక సందేహం.. మైక్రోవేవ్ లతో రేడియేషన్ ఉంటుందన్న అంచనా వుంది. అయితే.. ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్లే.. దీనికి కచ్ఛితంగా చెక్ పెట్టొచ్చని అంటున్నారు. ఏమైనా.. రానున్న రోజుల్లో ఆకాశం నుంచే మనకు అవసరమైన విద్యుత్ రానున్నదని చెప్పక తప్పదు.