Begin typing your search above and press return to search.

లాక్‌..'డౌన్‌..డౌన్‌'... చిర్రెత్తిన చైనా ప్ర‌జ‌లు

By:  Tupaki Desk   |   27 Nov 2022 8:30 AM GMT
లాక్‌..డౌన్‌..డౌన్‌...  చిర్రెత్తిన చైనా ప్ర‌జ‌లు
X
లాక్‌డౌన్... ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన చైనా. ఇప్పుడు ఆ లాక్ డౌన్ తోనే ప్ర‌జ‌ల నుంచి తిరుగుబాటు ఎదుర్కొంటూ స‌త‌మత‌మ‌వుతోంది. చైనాలో ప్ర‌జ‌లు లాక్‌డౌన్ అంటే చిర్రెత్తి పోతున్నారు. ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను నిరసిస్తూ ఏకంగా వీధుల్లోకి వ‌చ్చి ప్ర‌భుత్వంపై తిరుగుబాటు చేశారు. దీంతో చైనా క‌మ్యూనిస్టు ప్ర‌భుత్వం ఒక్క‌సారిగా కంగుతింది.

చైనాలో మ‌ళ్లీ క‌రోనా కేసులు విజృంభిస్తున్నాయి. దీంతో ప‌లు చోట్ల మ‌ళ్లీ చైనా ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధిస్తోంది. జిన్ జియాంగ్ ప్రాంతంలో క‌రోనా కేసులు పెర‌గ‌డంతో గ‌త 100 రోజులుగా ఇక్క‌డ ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించి క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేస్తోంది. ఇప్పుడు అదే చైనా ప్ర‌భుత్వం కొంప ముంచుతోంది. ఈ లాక్‌డౌన్‌తో విసుగెత్తి పోయిన ప్ర‌జ‌లు ప్ర‌భుత్వంపై తిరుగుబాటు ప్ర‌ద‌ర్శిస్తూ వీధుల్లోకి వ‌చ్చి ఆందోళ‌న‌లు చేస్తున్నారు.

వాయువ్య చైనాలో ఉండే జిన్ జియాంగ్ ప్రాంతంలో అతిపెద్ద న‌గ‌ర‌మైన ఉరుమ్కీలో ఇటీవ‌ల ఒక రెసిడెన్షియ‌ల్ అపార్టుమెంటులో అగ్నిప్ర‌మాదం సంభ‌వించి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘ‌ట‌న అక్క‌డ ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హావేశాలు క‌ట్ట‌లు తెంచుకునేలా చేసింది. లాక్‌డౌన్ విధించింనందువ‌ల్లే వీరు ప్రాణాలు కోల్పోయార‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా స‌హాయ‌క చర్య‌లు చేప‌ట్ట‌డం ఆల‌స్య‌మై అంత‌మంది ప్రాణాలు కోల్పోవాల్సి వ‌స్తోందిన ప్ర‌జ‌లు ఆగ్ర‌హావేశాల‌కు గుర‌య్యారు.

ఈ లాక్‌డౌన్‌ను త‌క్ష‌ణం ఎత్తివేయాల‌ని కోరుతూ అక్క‌డి ప్ర‌జ‌లు లాక్‌డౌన్ ఆంక్ష‌లు ఏకంగా వీధుల్లోకి వ‌చ్చి ప్ర‌భుత్వంపై తిరుగుబాటు చేశారు. వేలాది మంది ప్ర‌జ‌లు వీధుల్లోకి వ‌చ్చి వెంట‌నే లాక్‌డౌన్ ఎత్తివేయాల‌ని నిన‌దించారు. చ‌నిపోయిన‌వారి ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుతూ ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున కొవ్వొత్తుల‌ను వెలిగించి ప్రార్థ‌న‌లు చేశారు. ఊహించ‌ని ఈ సంఘ‌ట‌న‌తో అవాక్క‌యిన చైనా ప్ర‌భుత్వం అక్క‌డి త‌న బ‌ల‌గాల‌తో ప్ర‌జ‌ల‌ను చెద‌ర‌గొట్టే ప్ర‌య‌త్నం చేసింది. పోలీసులు పెప్ప‌ర్ స్ప్రే చేసి జ‌నాల‌ను చెద‌ర‌గొట్టారు. .

చైనా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా జిన్ జియాంగ్ ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి వ‌చ్చిన ఆందోళ‌న‌లు చేస్తున్న వీడియో దృశ్యాలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారాయి. చైనా ప్ర‌జ‌ల‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతూ, చైనా పోలీసులు తీరును విమ‌ర్శిస్తూ నెటిజ‌న్లు సామాజిక మాధ్య‌మాల‌తో హోరెత్తించారు. దీంతో చైనా ప్ర‌భుత్వం ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయి దిద్దుబాటు చ‌ర్య‌ల‌కుప‌క్ర‌మించింది

లాక్ డౌన్ కార‌ణంగా స‌హాయ‌క చ‌ర్య‌లు ఆల‌స్య‌మ‌య్యాయ‌నే వార్త‌ల‌ను చైనా అధికారులు కొట్టిపారేశారు. అద‌స‌లు కార‌ణ‌మే కాద‌న్నారు. ప్ర‌మాదం జ‌రిగిన భ‌వనం వ‌ద్ద ఎలాంటి బారీ కేడ్లు లేవ‌ని, నివాసితులు బ‌య‌ట‌కు వెళ్లేందుకు ఎలాంటి ఆంక్ష‌లు పెట్ట‌లేద‌ని చెప్ప‌కొచ్చారు.