Begin typing your search above and press return to search.

విస్తరణ వాదం: చైనాలో ఆహార సంక్షోభం?

By:  Tupaki Desk   |   2 Sep 2020 1:30 AM GMT
విస్తరణ వాదం: చైనాలో ఆహార సంక్షోభం?
X
విస్తరణ వాదంతో చెలరేగిపోతున్న చైనాకు సంక్షోబాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన చైనా ప్రస్తుతం 140 కోట్లకుపైగా జనాభాకు ఆహారాన్ని అందించలేక ఆహార సంక్షోభం దిశగా పయనిస్తోంది. ఈ మేరకు స్వయంగా అధ్యక్షుడు జిన్ పింగ్ వెల్లడించడం సంచలనమైంది.

చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ మాట్లాడుతూ.. ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. ఆహార వృథా విపరీతంగా ఉందని.. ప్రజల్లో అవగాహన కల్పించి అరికట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ క్రమంలోనే దేశంలోని అన్ని మీడియాల్లో ఆహార వృథాను అరికట్టాలని పెద్ద ఎత్తున ప్రచారకార్యక్రమాలు కొనసాగాయి. 2015లో చైనాలోని మహానగరాల్లో 17 నుంచి 18 టన్నుల ఆహారాన్ని వృథా చేసినట్లు గణాంకాలను మీడియాలో చూపించారు. ఇది దక్షిణ కొరియా ఆహార అవసరాలకు సరిపోతుందని తేల్చారు.

చైనా ఆహార అవసరాలు 30శాతం దిగుమతులే తీరుస్తాయి. వాణిజ్య యుద్ధంతో అమెరికా నుంచి వచ్చే ఆహార దిగుమతులు నిలిచిపోయాయి. భారత్, వియత్నాంలు కరోనా కారణంగా వరి ఎగుమతులు నిషేధించాయి. చైనాలో యాంగ్జీ కారణంగా వరదలు వచ్చి వరి ఉత్పత్తి నష్టపోయారు.

అయితే ఆహార సంక్షోభాన్ని జిన్ పింగ్ దాచేసి లఢక్, దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు సృష్టిస్తూ ప్రజల దృష్టిని మరలుస్తున్నాడని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.