Begin typing your search above and press return to search.

జిన్ పింగ్ వార్త కరెక్టేనా ?

By:  Tupaki Desk   |   25 Sep 2022 4:40 AM GMT
జిన్ పింగ్ వార్త కరెక్టేనా ?
X
ప్రపంచదేశాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఎందుకంటే చైనా అధినేత జిన్ పింగ్ ను అదుపులోకి తీసుకుని అక్కడి సైన్యం హౌస్ అరెస్టు చేసిందనే వార్త వల్ల. ఈ విషయాన్ని ధృవీకరించుకునేందుకు మార్గాలు లేవుకానీ బీజింగ్ లోని వాతావరణం మాత్రం చాలా హాటుహాటుగా ఉందట. కొన్ని ప్రావిన్సుల్లో సైన్యం కదలికలు బాగా ఎక్కువగా ఉన్నాయని కొందరు చైనీస్ వీడియో పోస్టులు పెడుతున్నారు. దాంతో చైనాలో ఏమి జరిగిందో స్పష్టంగా తెలియకపోయినా ఏదో జరిగిందనే అనుమానాలు మాత్రం పెరిగిపోతున్నాయి.

జిన్ పింగ్ ను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీపీఏ) అరెస్టు చేసిందంటు బీజేపీ నేత, మాజీ ఎంపీ సుబ్రమణ్యంస్వామి శనివారం ఉదయం సుమారు 11 గంటలకు ట్వీట్ పెట్టారు. దాంతో ఆ ట్వీట్ దేశంలో బాగా వైరల్ అయిపోయింది. ట్వీట్లో నిజమెంతన్న విషయంలో ఎవరికి వారుగా ఆరాలుతీయటం మొదలుపెట్టారు. అయితే జిన్ పింగ్ హౌస్ అరెస్టు వార్త ధృవపడలేదు. చైనా నియంత్రణ మొత్తం పీపీఏ చేతిలోకి వచ్చేసిందని ఆయన ట్వీట్ లో ఉంది.

అధ్యక్షుడిగా జిన్ పింగ్ ను తొలగించగానే తాత్కాలిక అధ్యక్షుడిగా లీ కియామింగ్ ను పీపీఏ నియమించిందనే ప్రచారం బాగా వైరల్ అయిపోయింది. చైనాలో సోషల్ మీడియా గానీ లేదా అధికారిక మీడియా గానీ ఈ విషయమై స్పందించలేదు. అయితే చైనాలోనే కొంతమంది తమ ప్రాంతాల్లో ఆర్మీ వాహనాలు హడావుడిగా తిరుగుతుండటాన్ని వీడియోలు తీసి అప్ లోడ్ చేస్తున్నారు.

చైనాలో కమ్యూనిస్టుపార్టీ అవినీతి వ్యతిరేక కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఇద్దరు మంత్రులను ఉరితీసేశారు. అలాగే నలుగురు ఉన్నతాధికారులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఈ ఆరుగురు కూడా రాజకీయంగా జిన్ పింగ్ వ్యతిరేకవర్గంగా ముద్రపడిన వారు. జరగిన డెవలప్మెంట్ నచ్చని పార్టీ హైకమాండ్ ఈ విషయంలో జిన్ పింగ్ పై బాగా ఫైర్ అయ్యిందట. అందుకనే హఠాత్తుగా జిన్ పింగ్ ను పదవిలో నుండి తప్పించి ఆర్మీ అండర్లో ఉంచిందనేది సారంశం. ఇది ఎంతవరకు నిజమో చూడాల్సిందే.