Begin typing your search above and press return to search.

జి జిన్‌పింగ్‌ పై విమర్శలు .. బిలియనీర్‌కు 18 ఏళ్ల జైలు శిక్ష !

By:  Tupaki Desk   |   22 Sep 2020 5:31 PM GMT
జి జిన్‌పింగ్‌ పై విమర్శలు .. బిలియనీర్‌కు 18 ఏళ్ల జైలు శిక్ష !
X
చైనా పేరుకే దేశం .. కానీ, మిల్ట్రీ కి మించిన రూల్స్ అక్కడ అమల్లో ఉంటాయి. చైనా ప్రజలకు కనీసం ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉండదు. ప్రభుత్వం ఎన్ని తప్పులు చేస్తున్నా... ఒక్క మాట కూడా అనలేని పరిస్థితి. ఎవరైనా అన్నారంటే వారికీ చిప్పకూడే. ఇప్పటి వరకూ ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఇప్పుడు తాజాగా మరో ఘటన జరిగింది. చైనాలో బిలియనీర్, రిటైర్డ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన రెన్ జికియాంగ్... ఈమధ్య చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ ను విమర్శించారు. ఇంతకీ అయన చేసిన విమర్శ ఏంటంటే... కరోనా వైరస్‌ని కంట్రోల్ చెయ్యడంలో ప్రభుత్వం ఫెయిలైందని అన్నారు.

అంతే, ఆ మాటకే, జిన్ ‌పింగ్ రెచ్చిపోయాడు. నరనరానా స్వార్థపూరిత ఆలోచనలు నింపుకున్న ఆయన, తననే విమర్శించారనే ఉద్దేశంతో రెన్ ‌పై పగబట్టాడు. ఆ తర్వాత అవినీతి కేసులో రెన్ జికియాంగ్‌కి కోర్టు 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సు విచారణలో భాగంగా బీజింగ్ కోర్టు రెన్ పలు తప్పులు చేసినట్లు చెప్పింది. వీటీలో రూ.120 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని, లంచాలు తీసుకున్నారని ,కంపెనీలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని, అక్రమాలకు పాల్పడటం వల్ల ఆ కంపెనీకి రూ.126 కోట్ల నష్టం వచ్చిందని కోర్టు తెలిపింది. దీనికి శిక్షగా 18 ఏళ్ల జైలు శిక్షతో పాటు, రూ.45 కోట్ల ఫైన్ విధించింది. రెన్ అక్రమంగా సంపాదించినదంతా రికవరీ అయ్యింది. తను చేసిన నేరాలను రెన్ స్వయంగా ఒప్పుకున్నారు. కోర్టు తీర్పును ఆయన స్వాగతిస్తున్నారు" అని జడ్జి తెలిపారు.చైనాలో కోర్టు శిక్షలు కఠినంగా ఉంటాయి. 99 శాతం అమలవుతాయి.

అయితే , రెన్ ‌కి చాలా మంది చైనా అధికారులతో సత్సంబంధాలు ఉన్నాయి. మార్చిలో... జిన్ ‌పింగ్ ‌కి వ్యతిరేకంగా ఓ ఎస్సై రాశారు. దాన్లో ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఆ తర్వాత తనపై జిన్ ‌పింగ్ చర్యలు తీసుకుంటాడని తెలిసే, అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాతే ఆయనపై అవినీతి కేసు నమోదైంది. ఏదైమైనా ముందు ముందు తనపై ఎలాంటి విమర్శలు చేయకుండా ఉండాలనే ఈ కఠిన శిక్షకి పాల్పడినట్టు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.