Begin typing your search above and press return to search.
చైనా అధ్యక్షులకు హెలీక్యాప్టర్ భయం.. ఎందుకు?
By: Tupaki Desk | 12 Oct 2019 7:25 AM GMTచైనా అధ్యక్షులకు హెలీక్యాప్టర్ భయం ఉందా.? ఏ చైనా అధ్యక్షుడు కూడా స్వల్ప దూరాలకు హెలీక్యాప్టర్లు ఎందుకు వాడరు.? తాజాగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా చెన్నైకి చేరుకున్నాక అక్కడి నుంచి 57 కిలోమీటర్ల దూరం ఉన్న మహాబలిపురానికి హెలీక్యాప్టర్ ఏర్పాటు చేసినా అందులో వెళ్లకుండా రోడ్డుమార్గం ద్వారానే తన బలమైన శత్రుదుర్భేద్ర కారు ‘హాంగ్ కీ’లో వెళ్లారు. మరో వైపు ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం మాత్రం చెన్నై విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలీక్యాప్టర్ లో మహాబలిపురం చేరుకున్నారు.
హాంగ్ కీ కారు చైనాకు చెందిన చాలా శక్తివంతమైన విలాసవంతమైన కారు. అధికారిక కమ్యూనిస్టు చైనా అధినేతలు ఈ కారును వినియోగిస్తారు.1958లో హాంగ్ కీ కారు చైనా అధ్యక్షుడు మావో జెడాంగ్ కోసం ప్రత్యేకంగా చైనా ఫస్ట్ ఆటో వర్క్స్ గ్రూపు తయారు చేసి ఇచ్చింది. చైనాలో వీఐపీలు - ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఈ కారును వినియోగిస్తారు.
నాడు మావో జెడాంగ్ పిలుపు మేరకు చైనా అధినేతలు హెలీక్యాప్టర్ లో ప్రయాణాలు దాదాపుగా చేయరు. భద్రతా కారణాలు కూడా కారణమే.. అది నియమంలా పాటిస్తారని చైనా విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. చైనా అధినేతలు కేవలం విమానాలు లేదా కార్లను మాత్రమే నాటి నుంచి వాడుతున్నారు. జీ20 సదస్సులో కూడా అందరు దేశాల అధ్యక్షులు హెలీక్యాప్టర్ లో వెళితే చైనా అధ్యక్షుడు మాత్రం తన హాంగ్ కీ కారులో ప్రయాణించడం విశేషం.
అయితే చైనీస్ బ్రాండ్ కార్లను ప్రమోట్ చేసేందుకు జిన్ పింగ్ ఇలా ఆ కారులో ప్రయాణాలు చేస్తుంటారనే అభిప్రాయం వినిపిస్తోంది.