Begin typing your search above and press return to search.
చైనా 'యువరాణి' ఫోటో బయటపెట్టాడు.. 14 ఏళ్లు జైలుశిక్ష వేసేశారు
By: Tupaki Desk | 3 Sep 2022 4:28 AM GMTఅతను మామూలు వ్యక్తి కాదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి అధినేత. ఆయన కన్నెర్ర చేస్తే దేశాలకు దేశాలే అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి. అలాంటిది గుట్టుగా తన కుమార్తె వివరాల్ని ప్రపంచంలో అందరికి తెలిసేలా చేయటమే కాదు.. ఆవిడ అడ్రస్ ను సైతం బయటపెట్టిన వైనం సంచలనంగా మారింది. ఇంతకూ ఆ శక్తివంతమైన దేశం ఏమిటన్నది ఇప్పటికే అర్థమై ఉంటుంది. అవును.. అది డ్రాగన్ దేశంగా పిలిచే చైనా రిపబ్లిక్.
అక్కడ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్న విషయం అందరికి తెలుసు. ఈ విషయాన్ని ఎవరైనా మరచి.. తొందరపాటుతో చిన్న మాట మాట్లాడినా అందుకు తగ్గ ఫలితాన్ని అనుభవించాల్సిందే. ఇక.. ఎవరైనా కాస్తంత స్వేచ్ఛను కోరుకుంటే.. అత్యుత్సాహపు ట్యాగ్ కట్టేసి.. అందుకు భారీ మూల్యాన్ని చెల్లించేలా చేయటం ఆ దేశ చట్టాలకు తెలిసిన నీతిగా చెప్పాలి.ఇన్నివికారాలు ఉన్నా.. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా మారిందంటే దానికి కారణం.. అధికార బలంతో తమకు వ్యతిరేకంగా ఉండే దేనినైనా నిర్దాక్షిణ్యంగా తొక్కేయటమే కాదు.
అదెంతలా ఉంటుందన్నదానికి నిదర్శనంగా ఒక ఉదంతాన్ని చెప్పుకొస్తారు. 2019లో నియూ టెంగ్యూ అనే చైనీయుడు దేశ అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కుమార్తె జీ మెంగ్జీ ఫోటోను.. ఆమె ఐడెంటిటీని వెబ్ సైట్ లో పోస్టు చేశాడు. వాటి ఆధారంగా మీడియాలో కథనాలు వచ్చాయి. అధ్యక్షుల వారి గారాల పట్టి వివరాలు బయటకు రావటం.. అవన్నీ సంచలనంగా ఉండటంతో వీటికి అత్యధిక ప్రాధాన్యత లభించింది. ఇవన్నీ.. జిన్ పింగ్ కు ఇబ్బందిగా ఉండేవే కావటం గమనార్హం.
ఇంతకూ ఆ వివరాలేమిటంటే.. అంత పవర్ ఫుల్ జిన్ పింగ్ కుమార్తె ఉన్నత చదువులు.. చైనాకు ఏ మాత్రం పొసగని మరో అగ్రరాజ్యమైన అమెరికాలో విద్యను అభ్యసించటం. అది కూడా ప్రపంచానికి తెలీకుండా మహా గుట్టుగా ఈ పని చేయటం.. సదరు కుర్రాడు ఆ వివరాల్ని బయటకు లీక్ చేయటంతో జిన్ పింగ్ కు ఎక్కడో మండింది. ఇక.. జిన్ పింగ్ కుమార్తె విషయానికి వస్తే ఆమె వయసు ముప్ఫై. పెద్దాయన రెండో భార్య కమ్ ఫోక్ సింగర్ అయిన పెంగ్ లియువాన్ తో కలిగిన సంతానంగా చెప్పాలి. అమెరికాలో ఉన్నత చదువు చదివి.. ఆపై ఐదేళ్లు చైనాలో ఉండి.. మళ్లీ అమెరికాకు వచ్చిన రీసెర్చి విద్యార్థిగా కొనసాగుతున్నారు.
ఈ మొత్తం వివరాల్ని తన తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టేశాడు. ఇంకేం ఉంది చెప్పండి. ఆ 22 ఏళ్ల కుర్రాడిని అరెస్టు చేసి జైల్లో పడేశారు. అక్కడి చట్టాల పదును ఎంతన్న విషయం అందరికి అర్థమయ్యేలా చేసి.. అతగాడి నేరానికి ఏకంగా 14 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ తీర్పును కూడా ఇచ్చేశారు. అధ్యక్షుల వారి గారాల పట్టి ఎక్కడ చదువుతోందన్న విషయాన్ని బయట ప్రపంచానికి తెలిసేలా చేయటానికి ఇంత భారీ శిక్షా? అంటూ అతగాడి తల్లి అతన్ని జైలు నుంచి బయటకు తీసుకురావటానికి నానా పాట్లు పడుతూనే ఉంది. కానీ.. అవేమీ వర్కువుట్ కాలేదు.
ఇలాంటి వేళ.. జిన్ పింగ్ కు ఒక బహిరంగ లేఖను రాసింది. తన కొడుక్కి న్యాయం దక్కకుండా ఏమేం చేస్తున్నారో వివరిస్తూ సంచలన వ్యాఖ్యల్ని చేసింది. అధ్యక్షుల వారి కుమార్తె ఐడెంటిటీని బయట పెట్టిన పాపానికి.. నియూకిని.. అతని కుటుంబాన్ని చంపేస్తామన్న బెదిరింపులతో పాటు.. అతడి తరఫు వాదించటానికి ఎవరు వచ్చినా.. ఎక్కువ కాలం పని చేయకుండా చేశారని ఆరోపించింది. తాము 14 మంది లాయర్లను నియమించుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. చివరకు జైల్లో ఉన్న కొడుకును కలిసేందుకు సైతం ఆ తల్లికి అనుమతి ఇవ్వని పరిస్థితి. ఈ తరహా శిక్షలు చైనాలోనే సాధ్యమని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.