Begin typing your search above and press return to search.
హాంకాంగ్ దేశమా? చైనాలో భాగమా? డ్రాగన్ పెత్తనమేమిటీ?
By: Tupaki Desk | 23 May 2020 12:30 AM GMTఒక వైరస్ చైనాను ప్రపంచం ముందు దోషిగా నిలబెడుతోంది. దీనిపై ప్రపంచ దేశాలన్నీ చైనాపై విమర్శలు చేస్తూ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతోపాటు చైనాకు ఆర్థికంగా నష్టాలు తెచ్చేలా పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికాతో వాణిజ్య యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో చైనా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా ఆర్థిక, వ్యాపార కేంద్రంగా ఉన్న హాంకాంగ్‌ను తన గుప్పిట్లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే జాతీయ భద్రతా చట్టాన్ని హాంకాంగ్‌లో అమలు చేసే బిల్లుకు సంబంధించిన ప్రతిపాదనలను శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుతో తమకు వ్యతిరేకంగా హాంకాంగ్‌లో జరుగుతున్న నిరసనలను అణగదొక్కి వాణిజ్యపరంగా పైచేయి సాధించేలా చైనా వ్యూహం పన్నింది.
వాస్తవంగా హాంకాంగ్ ఒకప్పుడు బ్రిటన్ పాలనలో ఉండేది. 1997లో చైనాకు హాంకాంగ్‌ను అప్పగిస్తూనే ఆ సమయంలో ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ మినీ రాజ్యాంగాన్ని రూపొందించుకునేందుకు ఒప్పందం కుదిరింది. ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 ప్రకారం చైనా ప్రభుత్వాన్ని ధిక్కరించకూడదు అనేది ఉంది. అయితే చైనా ఆధిపత్యంపై హాంకాంగ్‌వాసులు ఏళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. తమ దేశంపై సుదీర్ఘ కాలంగా సాగుతున్న చైనా పెత్తనం పై ప్రజాస్వామ్యవాదులు తప్పుబడుతూ తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేరస్తుల అప్పగింతకు సంబంధించిన ఒక బిల్లు పై చైనా కొన్ని ప్రతిపాదనలు చేయగా దాన్ని హాంకాంగ్ ప్రజలు తీవ్రంగా తిప్పికొట్టారు. గతేడాది తీవ్ర నిరసనలు తెలిపారు. హాంకాంగ్ ప్రత్యేక ప్రతిపత్తిని నిర్వీర్యం చేసేలా చైనా వ్యవహరిస్తోందంటూ హాంకాంగ్ వాసులు ఆందోళనలు చేస్తున్నారు.
హాంకాంగ్‌లో జాతీయ భద్రతా చట్టం అమలు చేసేందుకు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ తొలి రోజు సమావేశంలో ప్రతిపాదనలు ప్రవేశపెట్టనుందని అధికార వర్గాలు తెలిపాయి. చట్టాలను మరింత సమర్థవంతంగా అమలు చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఒక దేశం రెండు వ్యవస్థల విధానాన్ని మరింత మెరుగుపరచి.. దానిని పటిష్టం చేయాలని చైనా పార్లమెంట్ భావిస్తోందని పైకి చెప్పుకొస్తున్నా హాంకాంగ్ ను గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ఈ బిల్లు తెచ్చారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
చైనా తాజా నిర్ణయంతో తమ మనోభావాలు దెబ్బ తింటున్నాయని హాంకాంగ్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాంకాంగ్‌కు ముగింపు ఇది. ఒక దేశం- రెండు వ్యవస్థలకు చరమగీతం ఇది అని పేర్కొన్నారు. ఇలాంటి తప్పులు చేయకండి అంటూ హాంకాంగ్ సివిక్ పార్టీ చట్టసభ ప్రతినిధి ఒకరు హితవు పలికారు. హాంకాంగ్ ప్రజలకు బీజింగ్ ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను సంప్రదించకుండా ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోవడం సరికాదని చెబుతున్నారు. తాము ఈ విషయాన్ని విడిచిపెట్టమని, పోరాడుతూనే ఉంటామని అక్కడి ప్రజలు నినదిస్తున్నారు. తమ స్వయం ప్రతిపత్తిపై ఇది హేయమైన దాడి అని హాంకాంగ్ చివరి బ్రిటీష్ గవర్నర్ క్రిస్ పాటన్ ఖండించారు.
చైనా నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. అక్కడ (హాంకాంగ్) ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని, అదే గనుక నిజమైతే.. ఆ వివాదంపై తమ స్పందన చాలా తీవ్రంగా ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.
అమెరికాతో వాణిజ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. అమెరికా తమ దేశ స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ అయిన చైనా కంపెనీలను డీలిస్ట్ చేస్తోంది. దీంతో బిలియన్ల కొద్దీ అమెరికన్ డాలర్లు పెట్టుబడులుగా పొందుతున్న చైనీస్ సంస్థలు ఆర్థికంగా దెబ్బతిననున్నాయి. దీని దృష్టిలో ఉంచుకుని చైనా హాంకాంగ్‌లో నిరసనలను తగ్గించి అక్కడ వాణిజ్యపరంగా లబ్ధి పొందాలని చూస్తోంది. దీంతో పాటు తమకు మద్దతుగా ఉన్న బ్రిటన్ సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. అమెరికన్ ఎక్స్చేంజీల నుంచి తమ కంపెనీలు డీలిస్ట్ అయితే ప్రత్యామ్నాయంగా లండన్ ఎక్స్చేంజీ లో కంపెనీలను లిస్ట్ చేసే ప్రయత్నాలు ఉన్నాయి.