Begin typing your search above and press return to search.
ప్రత్యర్థుల్ని పేటీఎం బ్యాచ్ అంటూ చినరాజప్ప ఫైర్
By: Tupaki Desk | 9 Jun 2020 4:30 AM GMTచేతిలో అధికారం ఉన్నప్పుడు చెలరేగిపోవటం అందరూ చేసేదే. అందుకు భిన్నంగా ప్రతిపక్షంగా ఉంటూనే.. ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించటం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటివి అంత తేలిక కాదు. విభజన తర్వాత కొలువు తీరిన బాబు సర్కారులో హోంమంత్రిగా వ్యవహరించిన టీడీపీ నేత చినరాజప్ప తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్నిఅధినేత జగన్ అమ్ముకున్నట్లుగా తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటి పార్టీలో ఉన్న నేతలు తమను నోటికి వచ్చినట్లువిమర్శిస్తున్నారన్నారు. పేటీఎం బ్యాచ్.. బిహార్ లో దొంగ ఖాతాలు పెట్టే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తమ పార్టీ గురించి మాట్లాడతారా? అంటూ ఫైర్ అయ్యారు.
టెక్నాలజీని అందిపుచ్చుకొని హైదరాబాద్ లో హైటెక్ సిటీని నిర్మించామన్నారు. 13 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్న ఆయన.. జగన్ పార్టీ ట్విట్టర్లో పోస్టింగులు పెట్టటానికి కిరాయి పేటీఎం బ్యాచ్ లను పెంచి పోషిస్తుందన్నారు. బిహార్ నుంచి దొంగ ఖాతాలుపెట్టిన వారు ఇప్పుడు టీడీపీ ట్విట్టర్.. జూమ్ గురించి మాట్లాడుతున్నట్లు చెప్పారు.
సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తానని చెప్పి నమ్మించి మోసం చేసి ఏడాదికి రూ.5వేల కోట్లు.. ఐదేళ్లలో రూ.20వేల కోట్లు జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ అధికారపక్షానికి పేటీఎం బ్యాచ్ అంటూ పేరు పెట్టిన వైనం ఇప్పుడు వైరల్ గా మారింది. మొత్తంగా చూస్తే.. మిగిలిన తెలుగు తమ్ముళ్ల కంటే దూకుడు వ్యాఖ్యలు చేస్తున్న చినరాజప్ప ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు.