Begin typing your search above and press return to search.

వ్యాక్సినేషన్ లో చైనా రికార్డ్ ....100 కోట్ల డోసులతో అగ్రస్థానం !

By:  Tupaki Desk   |   21 Jun 2021 1:30 PM GMT
వ్యాక్సినేషన్ లో చైనా రికార్డ్ ....100 కోట్ల డోసులతో అగ్రస్థానం !
X
చైనాలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రపంచంలో ఏ దేశం కూడా దరిదాపుల్లోనే లేనంతగా సాగిపోతుంది. తమ దేశ ప్రజలకు 100 కోట్ల డోసుల కు పైగా టీకామందులు ఇచ్చి ప్రపంచంలోనే అతి పెద్ద ఇనాక్యులేషన్ కార్యక్రమాన్ని చేపట్టిన దేశంగా గుర్తింపు సంపాదించుకుంది. ఈ నెల 19 నాటికి చైనా, 1,010,489,000 డోసుల వ్యాక్సిన్ ఇచ్చినట్టు అక్కడి నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. శనివారంతో అంతమైన ఆరు రోజుల వ్యవధిలోనే 10 కోట్ల డోసుల పైగా వ్యాక్సిన్ ఇచ్చినట్టు ఈ సంస్థ వెల్లడించింది. అయితే ప్రజల్లో ఎంతమంది రెండు డోసులు తీసుకున్నారో, ఎంతమంది ఒకే డోసు తీసుకున్నారో స్పష్టమైన క్లారిటీ లేదు. జూన్ నెలాఖరుకు దేశ జనాభాలో 40 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నది లక్ష్యంగా ఉందని చైనా ఆరోగ్య నిపుణుడు జాంగ్ నన్షాన్ గత మార్చిలో తెలిపాడు.

ఈ మద్యే మళ్ళీ దేశంలో కరోనా వైరస్ కేసులు పెరగగానే అధికారులు వీటి కట్టడికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కేవలం 25 రోజుల్లో 100 మిలియన్ డోసుల నుంచి 200 మిలియన్ డోసులను ఇచ్చినట్టు హెల్త్ కమిషన్ వెల్లడించింది. ఆరు రోజుల్లోనే 800 మిలియన్ డోసుల నుంచి 900 మిలియన్ డోసులను ఇవ్వగలిగామని, ప్రజలు కూడా ఉత్సాహంగా ఈ వ్యాక్సినేషన్ కేంద్రాలకు వస్తున్నారని ఈ సంస్థ వెల్లడించింది. డెల్టా వేరియంట్ కారణంగా కేసుల సంఖ్య పెరిగిన మాట నిజమేనని, కానీ సామూహిక టెస్టింగులను పెంచడం, ఎక్కడికక్కడ లోకల్ లాక్ డౌన్ల విధింపు వంటి చర్యలతో సాధ్యమైనంతవరకు చాలావరకు వీటిని అదుపు చేయగలిగారు. సైకోఫామ్ వ్యాక్సిన్ ని, సైనోవాక్ టీకామందును కూడా అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించింది. అలాగే చైనా పలు దేశాలకి వ్యాక్సిన్ల సరఫరా కూడా చేసింది.