Begin typing your search above and press return to search.

మోడీ మాటలపై.. చైనా అలా, జపాన్ ఇలా!

By:  Tupaki Desk   |   18 Oct 2016 4:28 AM GMT
మోడీ మాటలపై.. చైనా అలా, జపాన్ ఇలా!
X
పైకి ఎంత చెప్పినా - ఎంతగా ప్రపంచం ఖండించినా - ఉగ్రవాదం విషయంలో భారత్ పడుతున్న ఇబ్బందులను బ్రిక్స్ సదస్సులో మోడీ వివరించినా చైనా పద్దతి మారలేదు. పైకి ముసిముసి నవ్వులు నవ్వుతూనే, భారత్ బాదను అర్ధం చేసుకున్నామన్నట్లు చెబుతూనే చివరికి పాక్ విషయానికొచ్చేసరికి ప్లేట్ ఫిరాయించేస్తోంది. గోవాలో జరిగిన బ్రిక్స్ సదస్సు వేదికగా పాకిస్థాన్ పైనా అది సహకరిస్తోన్న ఉగ్రవాదంపైనా ఫలితంగా భారత్ పడుతున్న ఇబ్బందులపైనా, జరుగుతున్న నష్టంపైనా మోడి అన్నిదేశాలకూ వివరించారు. అయితే ఈ విషయంపై స్పందించిన చైనా... ఇంత చెప్పిన తర్వాత కూడా పాతపాటే పాడింది.

ఉగ్రవాదానికి పాకిస్థాన్ పుట్టినిల్లు వంటిదని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్న మరునాడే చైనా స్పందించింది... ఉగ్రవాదాన్ని ఏ దేశంతోనూ ముడిపెట్టలేమంటూ భారత ప్రధాని మోడీ వ్యాఖ్యలను వ్యతిరేకించింది. తనవరకూ వచ్చిన రోజు తెలుస్తుందనుకోండి.. అయితే అక్కడితో ఆగని చైనా ఏకంగా పాకిస్థాన్ చేసిన గొప్ప త్యాగాలను ప్రపంచం గుర్తించాలంటూ అడ్డగోలుగా వ్యాఖ్యానించింది. ఉగ్రవాదం విషయంలో పాక్ చేస్తోన్న గొప్ప త్యాగం ఏమిటన్నది చైనా కళ్లతో చూస్తేనే అర్ధం అవుతుందేమో! ఈ విషయాలపై స్పందించిన చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హు చున్యింగ్... ఉగ్రవాదంపై చైనా వైఖరి స్థిరంగా ఉందని చెప్తూనే ఉగ్రవాదాన్ని ఏ ఒక్క దేశంతోనో, మరే ఒక్క మతంతోనో ముడిపెట్టడాన్ని చైనా వ్యతిరేకిస్తుందని చెప్పుకొచ్చింది. ఈ మాటల్లోనే చైనా ఏమి చెప్పాలనుకుంటుంది అన్న విషయం సుస్పష్టం!! ఆ విధంగా శాస్వత మిత్రుడిని వెనకేసుకురావడంలో అడ్డగోలు వాదనకు తెరలేపింది. / జపాన్ ఓకే.. చైనా పద్దతి మారదన్నమాట!

ఇదే క్రమంలో భారత దేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాద సమస్యల గురించి, తాజాగా జరిగిన ఉరీ ఉగ్రదాడి గురించి జపాన్ భారత దేశానికి అనుకూలంగా స్పందించింది. ఈ విషయాలపై మాట్లాడిన జపాన్ రాయబారి కెంజి హిరమట్సు... తమ దేశం కూడా ఉగ్రవాద బాధిత దేశమే అని, 19మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయిన ఉరీ ఉగ్రదాడ్నికి జపాన్ ఖండిస్తోందని తెలిపారు. అలాగే ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అని హిరమట్సు చెప్పారు.

ఇదే సమయంలో ఉగ్రవాదం విషయంలో తామెలా నష్టపోయింది చెప్పారు హిరమట్సు. గత జూలై నెలలో జరిగిన ఢాకా ఉగ్రదాడిలో ఒక భారతీయ యువతితో పాటు ఏడుగురు జపనీయులు కూడా మరణించిన సంఘటనను ఆయన గుర్తుచేశారు. ఢాకాలోని హోలీ ఆర్టిసాన్ బేకరీలో జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 29 మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే, ఉగ్రవాదంపై పోరాటంలో జపాన్, భారతదేశం కలిసి మెలిసి ఉండాలని హిరమట్సు తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/