Begin typing your search above and press return to search.
చైనాకు కరోనాను తెచ్చింది అగ్రరాజ్యమేనా?
By: Tupaki Desk | 14 March 2020 10:11 AM GMTమానవాళికి ఏదైనా విపత్తు ఏర్పడితే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నకు హాలీవుడ్ సినిమా చూస్తే.. జేమ్స్ బాండో.. లేదంటే మరో హీరోనో.. ఇదేమీ కాదంటే కొన్ని టీంలు తెర మీదకు వస్తుంటాయి. రీల్ లో కనిపించే సీన్లకు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో రియల్ సీన్లు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన కొన్ని దశాబ్దాల్లో ప్రపంచం ఎప్పుడూ ఎదుర్కోని ప్రాణాంతకమైన వైరస్ ను కరోనాతో ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికే ఈ వైరస్ పలు దేశాల్లో వ్యాప్తి చెందటమే కాదు.. వేలాది మంది ప్రాణాల్ని తీసింది. లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు రెండు అగ్ర రాజ్యాల మధ్య బ్లేమ్ గేమ్ మొదలైంది. ఈ వైరస్ ప్రారంభమైన చైనాను అమెరికా నిందించటమే కాదు.. దాన్ని గుర్తించే విషయంలోనూ విఫలమైందన్న విమర్శల్ని చేస్తున్నారు. ఈ ప్రాణాంతకమైన వైరస్ కు కొవిడ్ -19 అన్న పేరును ప్రపంచ ఆరోగ్య సంస్థ పెట్టినా.. అమెరికా మాత్రం వూహాన్ వైరస్ అని.. చైనా వైరస్ అని పేర్కొనటాన్ని చైనా తప్పు పడుతోంది.
అసలీ వైరస్ ఎప్పుడు మొదైలంది? ఎక్కడ మొదలైంది? మొదట ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి ఎవరు? అతడికి ఆ వైరస్ ఎలా సోకింది? లాంటి ప్రశ్నలకు ఇప్పటికి సమాధానం లభించని పరిస్థితి. ఈ ప్రశ్నల్ని సంధిస్తున్న అగ్రరాజ్యం చైనాను నిందిస్తుంది. అమెరికా తీరుపై ఇప్పటికే మండిపాటు వ్యక్తం చేస్తున్న చైనా.. అసలీ వైరస్ ను తమ దేశంలోని జొప్పించింది అమెరికానే అంటూ ఆరోపించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
అమెరికా ఆర్మీనే ఈ వైరస్ ను చైనాకు తీసుకొచ్చిందన్న అనుమానాన్ని చైనా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిజియన్ తన ట్విట్టర్ పేజీలో అమెరికాపై ఘాటు వ్యాఖ్యలు చేయటం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కొత్త చర్చను రేకెత్తించింది. ఇప్పటికే అమెరికా - చైనా మధ్య ట్రేడ్ వార్ జరుగుతున్న వేళ.. కరోనా నేపథ్యంలో సాగుతున్న మాటల యుద్ధం ప్రపంచానికి చికాకుగా మారింది.
ఇంతకాలం కరోనాను వ్యాప్తిని నిలువరించటంతో చైనా విఫలమైనట్లుగా అమెరికా విమర్శిస్తున్న వేళ.. అగ్రరాజ్యంపై ఇప్పుడు డ్రాగన్ దేశం మండిపడుతోంది. అమెరికాలో కరోనా వైరస్ ను ఎందుకు నిలువరించలేకపోతున్నారు? అన్నేసి మరణాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? అమెరికాలో మొదటి కరోనా కేసు ఎవరిది? అతనికి ఎక్కడ సోకింది? ఎలా సోకింది? ఇంతవరకూ ఎంతమంది అమెరికన్లు ఈ వైరస్ బారిన పడ్డారు? ఎంతమంది మరణించారు? ఆసుపత్రుల ఏర్పాటు విషయంలో అమెరికా ఎలాంటి చర్యలు చేపట్టింది? లాంటి ప్రశ్నలకు సమాధానం చెబుతారా? అన్న ప్రశ్నలకు అగ్రరాజ్యం నుంచి మౌనమే సమాధానంగా ఉండటం గమనార్హం. ఇంతకాలం చైనాపై ఆరోపణల దాడి చేసిన అమెరికా పైచేయిని ప్రదర్శిస్తే.. తాజాగా చైనా ఎదురుదాడి అమెరికాను ఆత్మరక్షణలో పడేసేలా చేసిందని చెప్పక తప్పదు.