Begin typing your search above and press return to search.
అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధమేనా?
By: Tupaki Desk | 23 Sep 2016 4:38 AM GMTపాకిస్థాన్ - చైనా ల సంబందాలపై అటు చైనా పత్రికల్లోనూ - ఇటు పాక్ మీడియాల్లోనూ భిన్నంగా కథనాలు వెలువడుతున్నాయి. కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ వైఖరికి చైనా మద్దతిస్తుందని, ఈ మేరకు తమకు హామీ లభించిందని పాక్ పత్రిక డాన్ తాజాగా పేర్కొంది. పాకిస్థాన్ తో అన్నిరకాల సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని.. పాకిస్తాన్ కు ఏ వేదికపై అయినా తాము మద్దతిస్తామని చైనా చెప్పినట్లు ఆ పత్రిక రాసుకొచ్చింది. అయితే ఈ విషయాలపై పాక్ పత్రికల కథనాలు ఇలా ఉంటే... చైనా అధికారిక మీడియా జిన్హువా వార్తలు మరోలా ఉన్నాయి.
వ్యూహాత్మక భాగస్వాములైన చైనా - పాక్ దేశాల మధ్య పరస్పర సహకారం - స్నేహం కొనసాగుతుందని లీ తెలిపినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. పాక్ కు అన్నివిధాలా సాయం చేయడానికి తాము సిద్ధమని.. అయితే అంతర్జాతీయ - స్థానిక వ్యవహారాలపై పాకిస్తాన్ తో సంబంధాలు కొనసాగించడానికి చైనా ఆసక్తి చూపుతోందని చైనా మీడియా స్పష్టం చేసింది. అయితే ఈ విషయాలపై అంతర్జాతీయ విశ్లేషకుల వాదన మరోలా ఉంది.
చైనా తెలివితేటలను తక్కువగా అంచనా వేయొద్దని - ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)పై పరస్పర సహకారం ద్వారా మంచి పురోగతి సాధించినట్టు చెబుతున్న చైనా... కేవలం ఆ ఇరుదేశాల స్థానిక వ్యవహారాలపై మాత్రమే పాక్ కు మద్దతుగా నిలుస్తుందని చెబుతున్నారు. చైనా కు ప్రయోజనం కలిగే పనులే పాక్ తో కలిసి చేస్తుంది తప్ప - పాక్ చేసే ప్రతీ పనికీ చైనా మద్దతు లభిస్తుందని కోవడం అమాయకత్వమే అవుతుందనేది వారి వాదన. ఈ క్రమంలో పాకిస్థాన్ కు మద్దతుగా చైనా బరిలోకి దిగడం అంటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లేనని - అలా చేస్తే మాత్రం యుద్ధ నష్టానికి కూడా సిద్ధపడినట్లేనని వారు చెబుతున్నారు. అయితే... మరో దేశం కోసం ఆర్ధిక నష్టానికి - ప్రాణ నష్టానికి చైనా ముమ్మాటికీ సిద్ధపడదనేది ఈ నిపుణుల అంచనా. అలా కాకుండా చైనా మనసు మారి పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచిన పక్షంలో అమెరికా - ఈయూలు భారత్ కు మద్దతిస్తాయని.. అదే గనక జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందనేది అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుల అంచనా!!