Begin typing your search above and press return to search.
పాకిస్థాన్ కు చైనా షాక్...ఇండియాదే పీవోకే
By: Tupaki Desk | 30 Nov 2018 11:08 AM GMTతనదాకా వస్తే కానీ అన్నట్లుగా..డ్రాగన్ కంట్రీ చైనాకు ఆలస్యంగా సోయి వచ్చింది. కరాచీలోని తమ దేశ కాన్సులేట్ పై దాడి జరిగిన తర్వాత ఆ దేశం మేలుకుంది. పాకిస్థాన్ పోర్టు సిటీ కరాచీలో కాల్పుల కలకలం చెలరేగింది. కరాచీలోని చైనా రాయబార కార్యాలయం సమీపంలోని క్లిప్టన్ ప్రాంతంలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతిచెందారు. సాయుధులైన నలుగురు వ్యక్తులు చైనా రాయబార కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కాగా వీరిని చెక్‌పాయింట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది నిలువరించింది. ఈ క్రమంలో చోటుచేసుకున్న ఎదురు కాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు చనిపోగా మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటనా స్థలం నుంచి దుండగులు పారిపోయారు. కాగా, ఈ దాడి అనంతరం చైనా తీవ్రంగా స్పందిస్తూ పాక్ కు సిగ్నల్ ఇచ్చింది.
ఓ మ్యాప్ ద్వారా పాకిస్థాన్ కు గట్టి హెచ్చరిక జారీ చేసింది. కాన్పులేట్‌పై దాడి జరిగిందంటూ వార్త ప్రసారం చేసిన చైనా అధికారిక చానెల్.. అందులో వాడిన మ్యాప్ లో పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ఇండియాలో భాగంగా చూపించింది. ఇలాంటి మ్యాప్ ను చైనా వాడటం ఇదే తొలిసారి. సాధారణంగా మ్యాప్ లకు సంబంధించి అక్కడి ప్రభుత్వం ఏవి చెబితే అవే అధికారిక చానెల్ వాడుతుంది. అందులో సిబ్బంది వాటిని మార్చడానికి వీలుండదు. ఆ లెక్కన చైనా కావాలనే ఈ మ్యాప్ ను వాడి పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక పంపించిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తమ పౌరులను కాపాడలేకపోయిన పాకిస్థాన్ కు చైనా ఇలా నిరసన తెలిపిందన్న వాదన కూడా ఉంది. దేశ - విదేశీ వ్యవహారాల్లో విధానపరమైన నిర్ణయాల్లో మార్పులు చేయడానికి ఇలా అధికారిక మీడియాను చైనా వాడుకోవడం ఎప్పటి నుంచో వస్తున్నదే.
ఇప్పుడు పాకిస్థాన్ స్పందన తెలుసుకోవడానికే ఇలా పీఓకేను ఇండియాలో భాగంగా చూపించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు పాక్ స్పందించలేదు. ఇండియా - చైనా మిలిటరీలు డిసెంబర్ 10న సంయుక్త విన్యాసాలు చేయనున్న నేపథ్యంలో డ్రాగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆసక్తి రేపుతున్నది. అయితే ఇదొక్క అంశం ఆధారంగా చైనా విధానం మారిందని చెప్పడానికి వీల్లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాలో అధికారికంగా విడుదల చేసిన మ్యాప్స్ లో ఎప్పుడూ పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ఇండియాలో భాగంగా చూపెట్టలేదు. పాకిస్థాన్ అత్యంత సన్నిహిత మిత్రపక్షాల్లో చైనా ఒకటి. చైనా ఇటీవలి సంవత్సరాల్లో పాకిస్థాన్ కు బిలియన్ల ఆర్థిక సాయం అందజేసింది. అరేబియా సముద్రంతో చైనా పశ్చిమ ప్రావిన్స్ ను అనుసంధానం చేసేందుకు చైనా అనేక నిర్మాణ కార్యక్రమాలను చేపట్టింది.