Begin typing your search above and press return to search.
మీ వల్లే కరోనా ..బ్రిటన్ లో చైనా విద్యార్థి పై దాడి !
By: Tupaki Desk | 4 March 2020 2:14 AMకరోనా ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ కరోనా వల్ల చాలా మంది మృత్యువాత పడుతున్నారు. అలాగే వేలకొద్ది ప్రజలు కరోనా వైరస్ భారిన పడి...హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు . అయితే , ఒకవైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంటే... మరోవైపు కరోనా ముసుగులో జాత్యహంకారం పెచ్చరిల్లుతోంది. లండన్ లో చైనా, తూర్పు ఆసియా దేశాల ప్రజలపై జాతి వివక్ష దాడులు జరుగుతున్నాయి. చైనా, తూర్పు ఆసియా దేశాల ప్రజల వల్లే ఈ వైరస్ వ్యాప్తి జరుగుతోందని అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫిబ్రవరి 24న లండన్‌లో చదువుతున్న జోనాథన్ మోక్ అనే వ్యక్తిపై ఈ తరహా దాడి జరిగింది. గాయాలైన ముఖాన్ని ఆ యువకుడు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ వార్త వైరల్ అయ్యింది. కుడి కంటికి గాయమైన విషయాన్ని అతను తీసుకున్న సెల్ఫీ ఫొటోను షేర్ చేశాడు. ముఖంపై కూడా పలు గాయాలున్నాయి. మా దేశంలో మీ కరోనా వైరస్ అక్కర్లేదు అంటూ కొట్టారని జోనాథన్ వెల్లడించాడు. అలాగే ముఖంలో అంతర్గతంగా కొన్ని గాయాలయ్యాయని వైద్యులు చెప్పారని, శస్త్రచికిత్స అవసరమన్నారని తెలిపాడు.
కాగా, గత రెండు సంవత్సరాలుగా తాను లండన్ లో చదువుకుంటున్నట్లు, ప్రతిసారి జాత్యాహంకార వ్యాఖ్యలకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసారు. దీనిపై తాము దర్యాప్తు జరుపుతున్నట్లు లండన్ పోలీసులు వెల్లడించారు. ఆ సంఘటన జరిగిన ప్రదేశంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి నిందితులని పట్టుకుంటాము అని తెలిపారు.