Begin typing your search above and press return to search.
వీర్యంలో కరోనా...ఆ యావ తగ్గించుకుంటే మంచిది!
By: Tupaki Desk | 10 May 2020 1:30 AM GMTచైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. భారత్ లోనూ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నా, ఇప్పటికీ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. కరోనాతో బాధపడే వ్యక్తి తుమ్మినా, దగ్గినా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలిసిందే. మరి శృంగారం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా.. అంటే తాజాగా చైనాలోని కొంతమంది పరిశోధకులు దీనిపై అధ్యయనం చేసి, నివేదిక విడుదల చేశారు.
చైనాలోని షాంగిక్యూ మున్సిపల్ ఆస్పత్రిలో కరోనా వైరస్‌తో బాధపడుతున్న 38మందిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. వీరిలో ఆరుగురి వీర్యంలో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఇద్దరు కోలుకోగా, మరో నలుగురు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నివేదికను జామా నెట్‌వర్క్ పబ్లిష్ చేసింది. పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కరోనా ఉన్నంత మాత్రాన మరొకరికి వైరస్ వ్యాపిస్తుందని కచ్చితంగా చెప్పలేమని, ఒకవేళ అది రుజువైతే శృంగారానికి దూరంగా ఉండటం కండోమ్ వాడకం నివారణకు మార్గాలుగా పరిగణించొచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.
అమెరికన్ సొసైటీ ఫర్ రీప్రొడెక్టివ్ మెడిసన్ తాజా అధ్యయనం ప్రకారం.. శృంగారం ద్వారా కరోనా వ్యాప్తి చెందడం లేదని భావించడం కన్నా - ముందు జాగ్రత్తగా ఉండటమే మంచిదని - అనుమానం ఉంటే 14రోజుల వరకూ దూరంగా ఉండాలని డాక్టర్ పీటర్ హెగెల్ సూచిస్తున్నారు. ఇదే సమయంలో కరోనా వ్యాక్సిన్ కోసం అన్ని దేశాల నిపుణులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు అక్కడ పూర్తిగా వైరస్ నుంచి బయటపడటంతో అక్కడ ఇప్పుడు ప్రజలు సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.