Begin typing your search above and press return to search.
అప్పుడే...అమెరికా కొత్త అధ్యక్షుడికి చైనా ఎసరు
By: Tupaki Desk | 24 Nov 2020 1:30 AM GMTచైనా బుద్ధి ఏంటో తెలియజేసేందుకు ఇదే ఉదాహరణ. ప్రెసిడెంట్ గా వైట్హౌస్ లోకి అడుగు పెట్టకముందే.. అమెరికాను చక్కదిద్దేందుకు జో బైడెన్ ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేందుకు అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌తన ఎకనమిక్ ప్లాన్‌ను ప్రకటించారు. అయితే, ఇదే సమయంలో ఆయనపై చైనా కన్నెర్ర చేసింది. బైడెన్ చాలా వీక్ అని కామెంట్ చేయడమే కాకుండా ఆయన వల్ల యుద్ధం రావచ్చునని చైనా పేర్కొంది.
చైనాకు చెందిన థింక్ ట్యాంక్ అడ్వాన్స్‌డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ అండ్ కాంటెంపరరీ చైనా స్టడీస్ డీన్ జెంగ్ యోంగ్నియాన్ అమెరికా కొత్త అధ్యక్షుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నూతనంగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాతో యుద్ధానికి సిద్ధమవుతాడని , ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చడమే దీని వెనుక కారణమని చైనా సలహాదారు ఆరోపించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడితో సంబంధాల పునరుద్ధరణ జరుగుతుందనే భ్రమ ప్రస్తుతం చైనాకు ఎంతమాత్రం లేదని ఆయన చెప్పుకొచ్చారు. అమెరికా అవలంభించబోయే కఠిన వైఖరిని ఎదుర్కొనేందుకు బీజింగ్ సిద్ధంగా ఉందన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీకాలంలో అమెరికా, చైనాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, అమెరికాతో పూర్వ మైత్రి పునరుద్ధరణకు పనికివచ్చే ప్రతి అవకాశాన్ని చైనా వినియోగించుకుంటుంది. కానీ ఫలితాలు మాత్రం నిరాశజనకంగానే ఉన్నాయి అని తేల్చేశారు ప్రస్తుతం అమెరికా, చైనాల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్నారు. ప్రస్తుతం అమెరికన్ సమాజం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ప్రజా సమస్యలను పరిష్కరించలేని పక్షంలో బైడెన్ వారి దృష్టిని మరల్చడానికి చైనా వ్యతిరేక చర్యలు ప్రారంభిస్తాడు. అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ప్రస్తుత, కొత్త అధ్యక్షుడి తీరును చైనా సలహాదారు విశ్లేషించారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ వంటి అంశాల పట్ల ట్రంప్ పెద్దగా శ్రద్ధ చూపలేదని పేర్కొన్న ఆయన బైడెన్ అందుకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తారని తెలిపారు. ట్రంప్ యుద్ధం పట్ల ఆసక్తి చూపలేదని పేర్కొంటూ బైడెన్ మాత్రం యుద్ధాన్ని ప్రారంభించగలడు అని జోస్యం చెప్పారు. కాగా, చైనా భయంతో ఈ కామెంట్లు చేసిందా లేకపోతే కొత్త అధ్యక్షుడిని ఆదిలోనే పలుచన చేయాలని చూస్తోందా? అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.