Begin typing your search above and press return to search.
చైనాకు చురకలంటించిన ఆనంద్ మహీంద్రా..!
By: Tupaki Desk | 9 March 2022 1:33 PM GMTఉక్రెయిన్, రష్యా యుద్ధం చాలా దేశాలకు కనువిప్పు కలిగిస్తుంది. ఇది చూసిన తర్వాత చాలా దేశాల్లో యుద్ధం అంటేనే ఒణుకు పుడుతుంది. ఎప్పుడు ఏ దేశం తో యుద్ధం సంభవిస్తుందో అని అంతర్మధనం చెందుతున్నాయి. ఇందులో భాగంగానే రాబోయే కాలం ఎలా ఉంటుందనేది తెలియక గందరగోళంలో ఉన్నాయి. అయితే వీటిని అన్నింటినీ దృష్టిలో ఉంచుకొన్న చైనా ఇటీవల భారీగా రక్షణ బడ్జెట్ను పెంచింది.
రానున్న రోజులకు సంబంధించి ముందు గానే సంబంధిత యుద్ధ సామాగ్రి ని సిద్ధం చేసుకోవడం లో భాగంగా రక్షణ శాఖకు బడ్జెట్ పెంపు నిర్ణయాన్ని తీసుకుంది. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా చైనా.. భారత్ పై అప్పుడప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ పెంపు అనేది కొంత మేర భారత్ ను కలవర పెట్టిన అంశంగా చెప్ప వచ్చు.
అయితే దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర చైనాకు గట్టి చురకలు అంటించారు. బడ్జెట్ పెంచినంత మాత్రానా రక్షణ రంగం ఓ అని పెరిగి పోదని అన్నాడు. రంగాన్ని పటిష్ట పరుచుకోవడం మంచిది అని అన్న ఆయన... దానిని ఉపయోగించుకునే విధానం గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
చైనా బడ్జెట్ పరిమాణం భారీగా పెంచింది.. రక్షణ రంగానికి బూస్ట్ ఇస్తోందని అనేక మంది అంటుంటే ఆనంద్ మహీంద్ర మాత్రం దాన్ని కొట్టి పారేస్తున్నారు. ఇప్పటికే కేటాయించిన వాటిని సరైన పద్ధతిలో ఉపయోగించడం నేర్చుకోవాలని అన్నారు. అలా చేయకపోతే ఎంత మొత్తం మైన వృద్ధా అని కామెంట్ చేశారు.
మహేష్ బాబు సినిమాలో ఓ డైలాగ్ లెక్కన.. రక్షణ రంగానికి మనం ఎంత బడ్జెట్ కేటాయించాము అనేది ముఖ్యం కాదని అన్నారు. వాటిని సరైన రీతిలో ఉపయోగించుకోవడం లోనే అసలైన మర్మం ఉంటుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో యుద్ధ రీతులు మరింత మారుతాయని అన్నారు.
ప్రస్తుతం ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధాన్ని ఉదహరించిన ఆయన... కేవలం డ్రోన్ల సాయంతో రష్యా యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్ మట్టి కనిపిస్తున్నట్లు చెప్పారు. యుద్ధం ప్రారంభమైనప్పుడు రష్యా రెండు రోజుల్లోనే ఉక్రెయిన్ కథ ముగిస్తుందని అందరూ భావించారని.. కాకపోతే వారి యుద్ధ రీతులతో రష్యా కు భారీ నష్టం కలుగ చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్ర.