Begin typing your search above and press return to search.

చైనా వ్యాక్సిన్ సీన్ ఎంతో చెప్పి షాకిచ్చాడు

By:  Tupaki Desk   |   11 April 2021 3:30 PM GMT
చైనా వ్యాక్సిన్ సీన్ ఎంతో చెప్పి షాకిచ్చాడు
X
మార్కెట్లోకి వెళ్లి వస్తువ ఏదైనా సరే.. తక్కువ రేటుకు.. కంటికి ఇంపుగా కనిపించిందంటే అది చైనా వస్తువే అయి ఉంటుంది. చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటుంది కానీ.. నాణ్యత విషయంలోనే ఎవరూ ఎలాంటి గ్యారెంటీ ఇవ్వరు. అదే చైనా మాల్ ప్రత్యేకత. తన బ్రాండ్ ఇమేజ్ ను ఏ మాత్రం మార్చుకోవటానికి ఆ దేశం సిద్ధంగా లేనట్లు ఉంది. ఈ కారణంతోనే కావొచ్చు.. చివరకు కరోనా వ్యాక్సిన్ విషయంలోనూ ఆ దేశం.. ‘చైనా సరుకు’ ఇమేజ్ ను ఏ మాత్రం మార్చటానికి ఇష్టపడనట్లుగా ఉంది.
చైనా తయారు చేసిన కోవిడ్ టీకా నాణ్యత మీదా.. దాని పని తీరుపైనా పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటాయి. తాజాగా ఆ అనుమానాలు నిజం కావటమే కాదు.. ఆ దేశ టీకా డొల్లతనాన్నిడ్రాగన్ దేశానికి చెందిన అత్యున్నత అధికారే బయటపెట్టేశారు. మహమ్మారిని ఎదుర్కోనే సామర్థ్యం చైనా టీకాకు తక్కువేనని తేల్చేశారు. ఈ కారణంతోనే ఆ దేశంలో తయారు చేసిన రెండు టీకాల్ని కలిపి.. దాని సామర్థ్యాన్ని పెంచాలన్న ఆలోచనలో అక్కడి ప్రభుత్వం ఉన్నట్లుగా చెబుతున్నారు.

చైనా సెంటర్ ఫర్ డిసీజ్కంట్రోల్ సీడీసీ గావో పూ సంచలన విషయాల్ని బయటపెట్టారు. చైనా వ్యాక్సిన్లకు కరోనా నుంచి కాపాడే సామర్థ్యం అధికంగా లేదని పేర్కొన్నారు. వీటిని వినియోగించాలా? వద్దా? అన్న విషయం మీద తాము చర్చలు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. నిజానికి పశ్చిమ దేశాలు టీకాను తయారు చేసిన పద్దతిని ఇదే పెద్ద మనిషి ఒకప్పుడు తప్పుపట్టారు. ఇప్పుడు ఆయన తన మాటల్ని మార్చేశారు.

చైనా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ సామర్థ్యం 50.4 శాతమేనని బ్రెజిల్ తేల్చింది. అదే సమయంలో అమెరికా డెవలప్ చేసిన ఫైజర్ వ్యాక్సిన్ సామర్థ్యం 97 శాతమని రుజుమైందని తేల్చారు. ఇప్పటివరకు చైనాలో 34 మిలియన్ల మందికి రెండు టీకా డోసుల్ని అందించటమే కాదు.. ప్రపంచంలోని పలు దేశాలకు చైనా తన టీకాల్ని కొన్ని కోట్ల డోసుల్ని విదేశాలకు పంపింది. మొత్తానికి చైనా మాల్ కు ఏ మాత్రం తీసిపోని ఈ వ్యాక్సిన్ వాడినోళ్ల పరిస్థితి ఆలోచిస్తేనే.. అయ్యో అనిపించక మానదు. తాజాగా చైనా అత్యున్నత అధికారి మాటల్ని విన్న విదేశీ ప్రభుత్వాలు ఎలా రియాక్టు అవుతాయో?