Begin typing your search above and press return to search.
చైనా దురాక్రమణకు హాంకాంగ్ అడ్డుకట్ట
By: Tupaki Desk | 25 Nov 2019 11:44 AM GMTసర్వ స్వతంత్రంగా ఇన్నాళ్లు ఉన్న హాంకాంగ్ పై చైనా ఆధిపత్యం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే.. హాంకాంగ్ పై చైనా నిర్భంధం విధించడం.. అక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహించడం.. చైనా నుంచి తమకు స్వాతంత్ర్యం కావాలంటూ ఆందోళనలు పెద్ద ఎత్తున చేస్తున్న సంగతి తెలిసిందే..
అయితే తాజాగా హాంకాంగ్ లో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 452 కౌన్సిల్ సీట్లకు గాను చైనాకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ప్రజాస్వామ్య అనుకూల వాదులు క్లీన్ స్వీప్ చేశారు. దాదాపు 90శాతం సీట్లను ప్రొడెమోక్రసీ పార్టీ గెలుచుకొని చైనాకు ఊహించని షాక్ ఇచ్చారు. చైనా అనుకూల చీఫ్ ఎగ్జిక్యూటివ్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఈ పరిణామం చైనా దురాక్రమణకు అడ్డుకట్ట వేసినట్టైంది.
హాంకాంగ్ పై చైనా ఆధిపత్యంతో అక్కడ కొన్ని నెలలుగా అనిశ్చితి నెలకొంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో హాంకాంగ్ వాసులు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓట్లు వేశారు. చైనాకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ప్రోడెమెక్రసీ పార్టీకి 90శాతం సీట్లు ఇచ్చి చరిత్రలోనే కనివీని ఎరుగుని విజయాన్ని అందించారు.
తాజాగా ఫలితాలు చైనాకు, ఆ దేశ అనుకూల పార్టీలకు షాక్ లా మారాయి. ఈ పరిణామాన్ని చైనా జీర్ణించుకోలేకపోతోంది.