Begin typing your search above and press return to search.
డ్రాగన్ కు కాలేలా చేసిన బాహుబలి వంతెన
By: Tupaki Desk | 30 May 2017 4:31 AM GMTతామేం చేసినా కరెక్టే అన్నట్లుగా వ్యవహరించే డ్రాగన్ కు దిమ్మ తిరిగిపోయేలా అప్పుడప్పుడు షాకులిస్తున్నారు ప్రధాని మోడీ. భారత్ - చైనా సరిహద్దుల్లో యుద్ధ సామాగ్రిని చేరవేసేందుకు వీలుగా చైనా ఎన్ని ప్రాజెక్టులకు తెర తీసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచేలా ఇష్టారాజ్యంగా వ్యవహరించే డ్రాగన్ దేశానికి దిమ్మ తిరిగిపోయే షాకిచ్చింది బాహుబలి వంతెన.
బ్రహ్మపుత్ర నదిపై 9.2 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ధోలా-సాదియా వంతెనను ప్రధాని మోడీ స్టార్ట్ చేయటం.. ఈ భారీ వంతెన పుణ్యమా అని రెండు రాష్ట్రాల మధ్య దూరం 165 కిలోమీటర్లు తగ్గిపోవటమే కాదు.. ప్రయాణ సమయం దాదాపు ఐదు గంటలకు పైనే తగ్గిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఈ భారీ వంతెన పుణ్యమా అని అరుణాచల్ ప్రదేశ్ లోని చైనా సరిహద్దుల్లోని భారత సైనిక శిబిరాలకు యుద్ధసామాగ్రిని తక్కువ సమయంలో చేరవేసే వీలుంది. వ్యూహాత్మకంగా నిర్మించిన అత్యంత కీలకమైన బాహుబలి వంతెన విషయంలో చైనా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తనకున్న అక్కసును తాజాగా బయటపెడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది.
సరిహద్దు సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ భారత్ అప్రమత్తంగా ఉండాలని.. సంయమనంతో వ్యవహరిస్తుందని తాము ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు. తూర్పున ఉన్న భారత్ - చైనా సరిహద్దుల పై తాము స్పష్టతతో ఉన్నట్లుగా డ్రాగన్ దేశం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మొత్తానికి మోడీ పర్సనల్ గా తీసుకొని మరీ.. త్వరగా పూర్తి అయ్యేలా చూసిన బాహుబలి వంతెన చైనాను విపరీతంగా ఇరిటేట్ చేసిందనటంలో సందేహం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/