Begin typing your search above and press return to search.
డ్రైవర్ లేకున్నా బస్సు బహ్మాండంగా నడిచింది
By: Tupaki Desk | 8 Sep 2015 11:09 PM GMTఅత్యాధునిక సాంకేతికతో అందివచ్చిన ఒక సౌలభ్యాన్ని పరీక్షించి విజయవంతంగా పూర్తి చేసింది చైనాలోని ఓ కంపెనీ. డ్రైవర్ లేని బస్సుల్ని రూపొందించాలన్న ప్రయత్నంలో భాగంగా.. నిర్వహించిన పరీక్ష విజయవంతంగా ముగిసినట్లు చెబుతున్నారు.
యూటాంగ్ బస్ కంపెనీ రూపొందించిన డ్రైవర్ లేకుండా నడిచే బస్సును ప్రయోగాత్మకంగా.. హెనాన్ ఫ్రావిన్స్ లో జెంగ్ ఝూ నుంచి కైఫెంగ్ సింటీ మధ్యనున్న 32.6కిలో మీటర్ల టెస్ట్ డ్రైవ్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు.
పరీక్షలో భాగంగా పలు అంశాల్లో ఈ బస్సు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది. అవసరానికి అనుగుణంగా రోడ్ లైన్లను దాటటం.. రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగిపోవటం.. ఎదుటి వాహనాల్ని ఓవర్ టేక్ చేయటం.. అడ్డుగా ఏదైనా వస్తే.. బ్రేకులు వేసుకోవటం లాంటి పనుల్ని ఈ బస్సు తనకున్న సాంకేతికతతో పూర్తి చేసినట్లుగా చెబుతున్నారు.
బస్సులో రెండు కెమేరాలు.. నాలుగు లేజర్ రాడార్లతో పాటు.. నావిగేషన్ సిస్టమ్ ను అమర్చినట్లు సదరు కంపెనీ వెల్లడించింది. తాజా ప్రయోగం విజయవంతం కావటంతో.. మూడేళ్లుగా ఈ కంపెనీ జరుపుతున్న డ్రైవర్ లెస్ బస్సు పరిశోధన ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెప్పొచ్చు. అయితే.. ఈ బస్సు జనబాహుళ్యంలోకి రావాలంటే ప్రభుత్వ విధానాల్లో మార్పులతో పాటు.. కొన్ని నిర్ణయాలు తీసుకుంటే తప్ప రోడ్డెక్కే అవకాశం తక్కువగా చెబుతున్నారు. ఎంత సాంకేతికత పెరిగితే మాత్రం.. డ్రైవర్ లేని బస్సులో జనాలు ఎక్కేందుకు ఇష్టపడతారా..?