Begin typing your search above and press return to search.

చైనా ఉల్ఫ్ వారియర్.. ఎందుకు తీసుకొచ్చింది..?

By:  Tupaki Desk   |   2 Jan 2023 6:50 AM GMT
చైనా ఉల్ఫ్ వారియర్.. ఎందుకు తీసుకొచ్చింది..?
X
భారత్ సరిహద్దు దేశం చైనా మరో భారీ స్కెచ్ వేస్తోంది. తన సరిహద్దు దేశాలైన నేపాల్, భారత్ తదితర దేశాలను తన కిందికి తెచ్చుకునేందుకు కుట్ర పన్నుతోంది. ఇంతకాలం తన ప్రభుత్వంలోని వ్యక్తులతో విదేశాలపై బురదజల్లే ప్రయత్నం చేసింది. అయితే చైనాకు చెందిన కొందరు నేతల వల్ల ఇది సాధ్యం కాకపోవడంతో వారిని మార్చేస్తోంది. మొన్నటి వరకు ఉన్న విదేశాంగ మంత్రిగా వాంగ్విని తీసేసి ఆయన స్థానంలో కొత్త వ్యక్తి క్వింగ్యాగ్ ను చేర్చుకుంది. ఈయన వయసు 53 ఏళ్లు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు అత్యంత సన్నిహితుడైన ఈయనతో ఇప్పుడు విదేశాల్లో 'ఉల్ప్ వారియర్'ను స్ట్రాట్ చేయనుంది. అయితే చైనా అనుకుంటున్న 'ఉల్ప్ వారియర్ అంటే ఏమిటి..? దానిని ఎందుకు తీసుకొచ్చింది..?' అన్న దానిపై స్పెషల్ ఫోకస్..

ఎదుటి వారు మన పక్కకు చేరాలంటే వారిలో బలహీనతలు వెతకడాలు. ఒకవేళ బలంగా ఉన్నా.. వారిలో చిచ్చు పెట్టి మన దారికి తెచ్చుకోవడాన్ని చైనా 'ఉల్ప్ వారియర్'గా భావిస్తుంది. అంతే తోడేళ్లలాలా మీద పడి వారి వినాశనానికి దారితీయడం అన్నమాట. మొన్నటి వరకు శ్రీలంక దేశంలో చైనా అదే చేసింది. మితిమీరిన అప్పులు అందించిన చైనా ఆ తరువాత ప్రభుత్వాన్ని పడగొట్టింది. ఆ తరువాత కొంత ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే పద్దతిని మిగతా దేశాల్లోనూ అవలంభించాలని చూస్తోంది.

అయితే ఇప్పటి వరకు విదేశాంగ మంత్రిగా ఉన్న వాంగ్వి ఇలా చేయడంలో సక్సెస్ కాలేకపోయాడు. భారత్ లోనూ పర్యటించిన ఆయన ఈ దేశం చేస్తున్న విధానాలపై ఎలాంటి వ్యతిరేకత చెప్పలేదు. కానీ చైనా మాత్రం ఇది సహించలేకపోయింది. భారత్, నేపాల్ తదితర దేశాల్లో ఉల్ఫ్ విధానాన్ని అవలంభించాలని ఎప్పటి నుంచో కాచుకు కూర్చుంది. ఈ నేపథ్యంలో విదేశాంగా మంత్రిని తప్పించింది. ఇప్పడు జిన్ పింగ్ తనకు అత్యంత సన్నిహితుడైన వాంగ్వితో విదేశాలపై కన్నింగ్ మైండ్ ఉపయోగించనుంది.

చైనా కుయుక్తులను పసిగట్టి భారత్ ఎప్పటికప్పుడు బుద్ధి చెబుతోంది. కానీ అంతకుమించి అన్నట్లుగా చైనాలో భారత్ కు సహకరిస్తున్న వారిని తొలగించి.. వారి స్థానంలో విదేశాల్లో వోల్ప్ విధానాన్ని పాటించే వారిని నియమించుకుంటోంది. అంటే రాబోయే రోజుల్లో చైనా మరోసారి తన దుర్భుద్ధి చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో చైనా సైనికులు, భారత జవాన్ల మధ్య పోరుతో భారత్ కే నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో చైనాకు బుద్ధి చెప్పేందుకు భారత్ రెడీ అవుతోంది. కానీ అంతకంటే ముందే చైనా తన ప్రభుత్వంలో పటిష్టమైన వ్యక్తులను చేర్చుకుంటోంది. వీరి ద్వారా ముందు ముందు ఎలాంటి కుట్రలు పన్నుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.