Begin typing your search above and press return to search.
క్రిమినల్ మైండ్ సెట్ అని తెలిసి జాగ్రత్త పడరే
By: Tupaki Desk | 2 Jun 2015 9:13 AM GMTచేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ప్రతిష్ఠ కోసం కిందామీదా పడిపోయి.. లేనిపోని సమస్యలు తల మీదకు తెచ్చుకున్న తెలుగుదేశంపార్టీ.. ప్రత్యర్ధిపార్టీలు చేసే విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆపరేషన్ రేవంత్ వ్యవహారంలో అడ్డంగా బుక్ అయిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడిప్పుడు నోరు తెరుస్తున్నారు.
తెలంగాణ.. ఆంధ్రా అన్న తేడా లేకుండా తమ రాజకీయ ప్రత్యర్థులు దొరికిందే సందన్నట్లుగా విరుచుకుపడటంపై వారు స్పందిస్తున్నారు. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి.. హోంశాఖామంత్రి చినరాజప్ప స్పందించారు.ఏపీ ఉప ముఖ్యమంత్రిగా వ్యహరిస్తున్న ఆయన.. టీఆర్ ఎస్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాకినాడలో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న చినరాజప్ప.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ది క్రిమినల్ మైండ్ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాంతంలోని టీడీపీ నేతల్ని ఏం చేయటానికైనా కేసీఆర్ వెనుకాడటం లేదని వ్యాఖ్యానించారు.
రేవంత్ వ్యవహారంలో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు. రేవంత్‌ను కావాలని ఇరికించారని వ్యాఖ్యానిస్తున్న చినరాజప్ప.. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలే చేశారు. మరి.. కేసీఆర్ ది క్రిమినల్ మైండ్ అని తెలిస్తే.. కాస్తంత ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాలే కానీ.. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎందుకు వ్యవహరించినట్లు? ఓ పక్క రేవంత్ ఆస్తుల మీద క్రాస్ చెకింగ్ జరుగుతుందని.. ఆయన్ను టార్గెట్ చేశారని తెలిసి కూడా ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోనట్లు అన్న ప్రశ్నకు తమ్ముళ్లు సంతృప్తికరమైన సమాధానం చెప్పలేకపోతున్నారు.