Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : చైనా లో కుక్కలు, పిల్లుల మాంసం తినడం పై నిషేధం ..ఎన్ని రోజులంటే ?

By:  Tupaki Desk   |   2 April 2020 9:11 AM GMT
బ్రేకింగ్ : చైనా లో కుక్కలు, పిల్లుల మాంసం తినడం పై నిషేధం ..ఎన్ని రోజులంటే ?
X
ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా మహమ్మారి చైనా లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాపించిన తర్వాత చైనీయుల తిండిపై రకరకాల పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని వీడియోలు పెట్టి ఇవి తింటే కరోనా రాదా.. అవి తింటే కత్రినా వస్తుందా ? అంటూ వారి ఫుడ్ ను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా గబ్బిలాల మాంసం ద్వారా ఈ కరోనా వ్యాపించిందని తొలుత కొంతమంది అభిప్రాయపడ్డారు.

ఈ తరుణం లో సంచలన నిర్ణయం తీసుకుంది చైనా కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో చైనాలోని షెన్‌ జెన్‌ సిటీలో పిల్లులు, కుక్కల విక్రయంపై నిషేధం విధించింది. ఇప్పుడు ఎందుకు అక్కడ కుక్కలు , పిల్లుల మాంసం పై నిషేధం విధించారు అంటే ..ప్రస్తుతం చైనా లో కరోనా ప్రభావం పెద్దగా లేదు. దాదాపుగా తగ్గిపోయింది. దీనితో వూహాన్‌ లో మార్కెట్లు తెరుచుకోవడంతో మళ్లీ అక్కడివారు మాంసాహారం కోసం ఎగబడుతున్నారు. అందులో కుక్క, పిల్లి మాంసంతో పాటు గబ్బిలాల మాంసం కూడా ఉంది.

ఈ నేపథ్యంలో అక్కడి షెన్‌ జెన్ నగరం తొలిసారిగా కుక్కలు, పిల్లుల మాంసం తినడంపై నిషేధం విధించింది. ఈ నిబంధనలు మే 1వ తేదీ నుంచి అమలులోనికి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఇక కుక్కలు,పిల్లులతో పాటుగా పాములు, బల్లులు, రక్షిత వన్యప్రాణులను తినడంపై నిషేధం విధించారు. అంతేకాదు.. వాటి పెంపకం, విక్రయం, వినియోగాన్ని ఈ షెన్‌ జెన్‌ నగరంలో బ్యాన్ చేశారు. ఇలా షెన్‌ జెన్‌ నగరంలో జంతువులపై నిషేధం విధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇక, కుక్కలు, పిల్లులు మరియు ఇతర పెంపుడు జంతువుల వినియోగాన్ని అభివృద్ధి చెందిన హాంగ్‌కాంగ్‌, తైవాన్‌ దేశాల్లో ఇప్పటికే నిషేధించారు. చైనాలోని వుహాన్‌ నగరంలోని జంతువధ శాల కేంద్రంగా 2019, డిసెంబర్‌ నెలలో కరోనా వైరస్‌ ప్రబలిన విషయం తెలిసిందే. అయితే , కొత్తగా రూపొందించిన చట్టం నుంచి పందులు, ఆవులు, గొర్రెలు, గాడిదలు, కుందేళ్లు, కోళ్లు, బాతులు, పావురాలు, పిట్టలకు నిషేధం నుంచి మినహాయించారు. ప్రస్తుతం కరోనా కి కారణం చైనా ఆహారపు అలవాట్లే అని కామెంట్స్ చేస్తున్న తరుణంలో చైనా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.