Begin typing your search above and press return to search.
ట్రంప్ వద్దు కానీ, ట్రంపు కూతురు కావాలట..
By: Tupaki Desk | 25 Feb 2017 12:46 PM GMTకాస్త ఏజ్ ముదిరినా కూడా సెక్సప్పీల్ లో ఎక్కడా వంక పెట్టడానికి లేని ఫిగర్ ఇవాంకా.. ఇవాంకా ఎవరు అని మాత్రం దయచేసి అడగొద్దు. అంత సూపర్ ఫిగర్ - అందులోనూ అమెరికా అధ్యక్షుడు కూతురి గురించి పదేపదే ఇంట్రడక్షన్ ఇవ్వడం కష్టమే. అర్థమైంది కదా.. ఇవాంకా అంటే ట్రంప్ కూతురు. ట్రంప్ తన నోటి దురదతో చైనాలాంటి దేశాలకు మంట పుట్టిస్తుంటే ఆయన కుమార్తె మాత్రం తన అందంతో వారి గుండెల్లో మంట పుట్టిస్తోందట. చైనాపై తరచూ విరుచుకుపడే ట్రంప్ అంటే చైనీయులు కూడా బాగా కోపంగా ఉంటున్నారు.. అదే సమయంలో ట్రంప్ కూతురి కోసం పోటీ పడుతున్నారు.
ఇవాంకా పేరు ఇప్పుడు అమెరికాలో కంటే చైనాలోనే బాగా పాపులర్ అయిందట. ఆమె పేరు మీద ఓ కాస్మెటిక్ సర్జరీలు కూడా వచ్చేశాయి. ఇవాంకలాగా కనిపించాలంటే... కాస్మెటిక్ సర్జరీ చేస్తామంటూ ఓ చైనా కంపెనీ ప్రకటిస్తోంది. ఆమె పేరు కోసం చైనా కంపెనీలు పోటీలు పడుతున్నాయి. అనేక వస్తువులు.. ముఖ్యంగా మహిళల అందానికి సంబంధించి వస్తువులకు ఇవాంకా పేరు పెట్టడానికి అందరూ రెడీ అవుతున్నారు.
ఇవాంక ట్రంప్ పేరునో, లేదా అలా వినిపించే ఇంకేదైనా పేరునైనా తమ బ్రాండ్ లకు పెట్టుకునే అవకాశం ఇవ్వాలంటూ ఎన్నో కంపెనీలు చైనాలో దరఖాస్తు చేసుకుంటున్నాయి. ఇవాంక పేరుతో తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో స్పా సర్వీసులు - డైట్ పిల్స్ - చర్మం ముడతలు పడకుండా కాపాడే క్రీములు - మసాజ్ మెషీన్లు - లో దుస్తులు - శానిటరీ నాప్ కిన్లు - కాస్మొటిక్ సర్జరీలు ఉన్నాయి. అన్నట్లు ఇంకో మాట.. కొన్ని కండోమ్ కంపెనీలు కూడా ఇవాంకా పేరును వాడుకోవడానికి ప్లాన్ చేస్తున్నాయట. మొత్తానికి మామ తిడుతున్నా భామపై ప్రేమ పెరిగిపోతోంది చైనావాళ్లకు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/