Begin typing your search above and press return to search.

ప్ర‌భుత్వ టెండ‌ర్ల‌లో చైనా కంపెనీలను నిషేధించాలి !

By:  Tupaki Desk   |   17 Jun 2020 6:15 AM GMT
ప్ర‌భుత్వ టెండ‌ర్ల‌లో చైనా కంపెనీలను నిషేధించాలి !
X
లద్దాఖ్‌ లోని గాల్వన్ లోయలో భారత్, చైనా ఆర్మీకి జరిగిన ఘర్షణలో ఆర్మీ కల్నల్ ‌తో పాటు 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ ఘర్షణలో భార‌త సైనికులు ప్రాణాలు కోల్పోవ‌డంపై ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వ‌దేశీ జాగ‌ర‌న్ మంచ్ (ఎస్ ‌జే ఎమ్‌) తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. దేశం కోసం ప్రాణాలని తృణ ప్రాయంగా విడిచిన మన జవాన్లకి నివాళిగా ప్ర‌భుత్వం చేప‌ట్టే టెండ‌ర్ల‌లో చైనా కంపెనీలు పాల్గొన‌కుండా నిషేధం విధించాల‌ని కేంద్రాన్ని డిమాండ్ చేసింది.

అదేవిధంగా దేశంలో చైనా ఉత్ప‌త్తుల‌ను బ‌హిష్క‌రించే దిశ‌గా అడుగులు వేయాల‌ని సూచించింది. బుధ‌వారం ఎస్‌ జేఎమ్ కో క‌న్వీన‌ర్ అశ్వ‌ని మ‌హాజ‌న్ మాట్లాడుతూ.. న‌టీన‌టులు, క్రికెట‌ర్లు, ఇత‌ర సెల‌బ్రిటీలు సైతం చైనా ఉత్ప‌త్తుల‌ను ప్రోత్స‌హించ‌ వ‌ద్ద‌ని కోరారు. కాగా మే 5వ తేదీ నుంచి చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్న విష‌యం తెలిసిందే. దీని పై రెండు దేశాల మ‌ధ్య చర్చ‌లు మేనేజ‌ర్ జ‌న‌ర‌ల్ స్థాయి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

ఈ క్ర‌మంలో రెండు దేశాలు త‌మ సైన్యాల‌ను వెన‌క్కు త‌ర‌లించ‌డం ప్రారంభించాయి. ఇదే స‌మ‌యంలో సోమ‌వారం రాత్రి ల‌డ‌ఖ్‌ లో భార‌త్-చైనా ఆర్మీ మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో హింసాత్మ‌క ఘ‌ర్ష‌ణ‌లు తలెత్తాయి. ముఖాముఖీ పోరాటంలో రాళ్లు, ఇనుప రాడ్‌ ల‌తో చైనా సైనికులు దాడి చేశార‌ని ఆర్మీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ దాడిలో 20 మంది భార‌తీయ సైనికులు అమ‌రుల‌య్యారు. దీనిపై ఇప్పుడు దేశంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది. చైనా కి తగిన బుద్ది చెప్పాల్సిందే అని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు.