Begin typing your search above and press return to search.
పోతూ పోతూ గట్టిగా ఇచ్చాడుగా.. చైనాకు ట్రంప్ భారీ షాక్..!
By: Tupaki Desk | 19 Dec 2020 5:00 PM GMTమరికొన్ని రోజుల్లోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదవి నుంచి దిగిపోనున్నాడు. ఈ నేపథ్యంలో చైనాకు ట్రంప్ లాస్ట్పంచ్ ఇచ్చేసి పోతున్నాడు. తన చివరి అస్త్రాన్ని చైనా మీదకు ఎక్కుపెట్టాడు. ఈ కీలక బిల్లుపై సంతకం పెట్టాడు ట్రంప్. ఈ బిల్లు ప్రకారం.. చైనా కంపెనీలు కనుక యూఎస్ నిబంధనలు పాటించకపోతే అమెరికా స్టాక్ ఎక్సేంజ్ నుంచి వాటిని తొలగిస్తారు. ఈ కీలకబిల్లుకు ట్రంప్ రీసెంట్గా ఆమోదం తెలిపాడు. అమెరికాలో చైనా కంపెనీలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని.. తప్పుడు వాణిజ్య పద్ధతులు అవలంభిస్తున్నాయని ట్రంప్ కొంతకాలంగా ఆరోపిస్తున్నాడు.దీంతో తాజాగా ట్రంప్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
చైనా కంపెనీలను సమీక్షించేందుకు అమెరికన్ రెగ్యులేటర్లను కనక చైనా కంపెనీలు ఆమోదించకపోతే యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి సదరు కంపెనీలను తొలగిస్తారు. ఇతర దేశాలకు చెందిన కంపెనీలు అమెరికాలో వ్యాపారం చేస్తున్నప్పుడు కొన్ని నిబంధనలు పాటించాలి. కానీ చైనాకు చెందిన అలీబాబా గ్రూప్, పిండుడువో, పెట్రోచైనా వంటి కంపెనీలు ఈ రూల్స్ ఉల్లంఘిస్తున్నట్టు సమాచారం. అందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడని వ్యాపార వర్గాలు అంటున్నాయి.
అయితే ట్రంప్ నిర్ణయాన్ని కొందరు తప్పబడుతున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా చైనా మధ్య ఆరోగ్యకరమైన వ్యాపార సంబంధాలను చెడగొడుతుందని వాళ్లు అంటున్నారు. ఇటువంటి నిర్ణయాలు ట్రేడ్ వార్‌కు దారితీసే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే తరుచూ సంచలన నిర్ణయాలు తీసుకొనే ట్రంప్ ఈ సారి చైనా మీద పడ్డాడు. చైనా ప్రభుత్వం, అక్కడి కంపెనీలపై ట్రంప్ గతంలోనూ అనేకసార్లు విరుచుకుపడ్డాడు. కరోనా వైరస్‌ను కూడా చైనా వైరస్ అంటూ ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే.