Begin typing your search above and press return to search.
మా మంచి చైర్మన్... ఫ్రీగా ప్యారిస్ తీసుకువెళ్ళాడు!
By: Tupaki Desk | 10 May 2015 11:12 AM GMTఏదైనా కంపెనీలో పనిచేస్తుంటే... ఆ సమయంలో ఆ కంపెనీ చైర్మన్ కి సంతోషం కలిగితే, కంపెనీ లాబాల్లో ఉంటే ఏమి జరుగుతుంది! బోనస్ లు ఇస్తారు, ఇంక్రిమెంట్ లు ఇస్తారు... టాక్స్ ఎగ్గొట్టాలంటే కార్లు, బైకులు, ఐఫోన్ లు బహుమతులుగా ఇస్తుంటారు!! కానీ... ఏకంగా కంపెనీలో పనిచేస్తున్న వేల మందిని హాలిడే ట్రిప్ కు తీసుకువెళతారా? కంగారు పడకండి! తీసుకువెళతారు! కాదు తీసుకువెళ్లారు!
వివరాల్లోకి వెళితే... చైనాకు చెందిన తియోన్స్ గ్రూపు కు చైర్మన్ "లీ" ఒక బిలియనీర్! ఆయన తన కంపెనీలో పని చేస్తున్న 12 వేలమంది సిబ్బందిలో సుమారు సగం (ఆరువేలు) మందిని నాలుగురోజుల హాలిడే ట్రిప్ కోసం ప్యారిస్ తీసుకువెళ్ళాడు. ఇందుకోసం ప్యారిస్‌లోని దాదాపు 140 హోటల్స్‌ను, వాటిలో 4,760 గదులను బుక్ చేయించాడట. తన సంస్థ ప్రారంభించి ఇరవై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఇలా వెరైటీగా, అట్టహాసంగా దాదాపు ఆరువేలమంది సిబ్బందిని పెద్దఎత్తున ఫ్రాన్స్‌కు తరలించాడు.
ఈ విషయం తెలిసి కొంత మండి అబ్బో... అనుకుంటుంటే... మరి కొంత మండి మాత్రం... ఆ కంపెనీలో మేమెందుకు పనిచేయలేదబ్బా అని ఫీలవుతున్నారట! పారీస్ టూర్ లో ఉన్న లీ కంపెనీ సిబ్బంది... అక్కడ చరిత్రాత్మక పిక్నిక్ స్పాట్‌లను సందర్శించడమే గాక అతి పెద్ద మానవ హారాన్ని కూడా ఏర్పాటు చేశారట! ఆరు వేలమందిని హాలిడేకి తీసుకువెళ్లడమే ఒక రిక్కర్డు అయితే... వీరు ఏర్పాటుచేసిన మానవహారం కూడా రికార్డు సృష్టించింది! గిన్నిస్‌బుక్ వాల్డ్ రికార్డ్స్ వారు కూడా అక్కడికి చేరుకొని ఆశ్చర్యపోయారట! ఈ రేంజ్ చైర్మన్ దొరకాలి అని చైనా ప్రజలేనా... కాదు అంతా కోరుకుంటున్నారట!!