Begin typing your search above and press return to search.
ఈ భామ గురించి వింటే షాక్ తింటారు
By: Tupaki Desk | 2 April 2016 7:00 AM GMTఫోటోలోని అమ్మడ్ని చూశారుగా. అల్ట్రా మోడ్రన్ గా కనిపిస్తున్న ఈ అమ్మాయిని చూసి మనసు పడితే మొదటికే మోసం పక్కా. ఎందుకంటే ఈ భామ మనిషి కాదు. అసలుసిసలు యంత్రం. ఆ మధ్యన రజనీకాంత్ హీరోగా నటించిన రోబో చిత్రంలో తనను పోలినట్లుండే చిట్టిని తయారు చేయటం తెలిసిందే. ఇలాంటివి సాధ్యమేనా? అన్న ప్రశ్నకు సమాధానంగా ఈ మధ్యన హ్యూమనాయిడ్ లను విరివిరిగా తయారు చేయటం తెలిసిందే.
రిసెప్షనిస్ట్ గా.. సేల్స్ పర్సన్ గానే కాదు.. రోజువారీ జీవితంలో ఎన్నో పనులకు ఈ హ్యూమనాయిడ్ లు ఉపయోగపడుతున్నాయి. చూసేందుకు అచ్చం మనిషిలా ఉంటే ఈ మరమనుషులు.. దగ్గరికి వస్తే కానీ అసలు విషయం కనిపించదు.
చూసిన వెంటనే ఆకర్షించేలా ఉన్న ఈ హ్యూమనాయిడ్ ను చైనాలోని హాంకాంగ్ కు చెందిన రిక్కీ మా అనే వ్యక్తి (రోబో భామ పక్కనున్న వ్యక్తి) 18 నెలలు కష్టపడి తయారు చేశారు. ఇందుకోసం రూ.35 లక్షలు ఖర్చు చేశారు. హాలీవుడ్ భామలా ఉంటే అమ్మాయి తన పక్కన ఉండాలన్న తన కోరికను ఇలా నిజం చేసుకోవటం ఆసక్తికరం. కొన్ని సంవత్సరాల వ్యవధిలో ఇలాంటి హ్యూమనాయిడ్ రోబోలు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చేస్తాయని చెబుతున్నారు.