Begin typing your search above and press return to search.
మాటకు సిగ్గుపడి చంపేస్తున్న ‘రోబో భామ’
By: Tupaki Desk | 3 April 2016 7:30 PM GMTసొగసుకత్తె సిగ్గుపడితే ఆ అందమే వేరు. మగాడిని సవాలు చేసే వగలాడి అందం లాంటి మాటకు కాలం చెల్లినట్లే. అందాల భామలే కాదు.. అంతకు మించిన సొగసున్న ఆడ రోబోలు వచ్చేయటమే కాదు.. తమ హావభావాలతో పిచ్చెక్కించేస్తున్నాయ్. తాజాగా వార్తల్లోకి ఎక్కిన హాంకాంగ్ గ్రాఫిక్ డిజైనర్ రూపొందించిన రోభామ (రోబో భామకు షార్ట్ కట్ చస్తే..) కు సంబంధించిన వార్తలు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. ముట్టుకుంటే కందిపోయేలా కనిపించేఈ హ్యుమనాయిడ్ రోబో.. మనిషి మాదిరే చేసే కొన్ని చేష్టలకు ఎంతటి వాడైనా పిధా కావాల్సిందేనట.
దాదాపు ఏడాదిన్నర పాటు కష్టపడి రికీ తయారు చేసుకున్న రోభామ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చూసేందుకు అచ్చు మనిషిలా ఉండే ఈ రోభామ.. రికీ మాటలకు రియాక్ట్ కూడా అవుతుంది. ఉదాహరణకు.. నువ్వు చాలా అందంగా ఉన్నావ్ అంటూ రికీ నోటి నుంచి మాట వస్తేచాలు.. కనుబొమ్మలు చిద్విలాసంగా పైకి ఎగరేసి.. కళ్లను తిప్పుతూ.. అవునా.. థ్యాంక్స్ అంటూ సిగ్గుపడే తీరు చూస్తే.. ఎంతటి మగాడైనా సరే.. తమ ఎదుట ఉన్నది యంత్రమన్న విషయాన్ని మరిచిపోయి దాని మోజులో పడిపోవటం ఖాయమట.
తన అందంతోనే కాదు.. తన చేష్టలతో పిచ్చెక్కిస్తున్న ఈ రోభామ శరీరాన్ని 70 వాతం త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో సృష్టించారు. తన కలల రోభామను తయారు చేసే ప్రయత్నంలో రికీని చాలామంది నిరుత్సాహపరిచినా.. తాజాగా ఆయన తయారు చేసిన దాన్ని.. దాని చేష్టల్ని చూస్తున్నోళ్లంతా నోరెళ్లబెట్టటమే కాదు.. నోట మాట రాకుండా ఉండిపోతున్నారట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తాను తయారుచేసిన రోభామను మరింత డెవలప్ చేసేందుకు.. ఎవరైనా ఫండ్స్ ఇస్తే అద్భుతాలు సృష్టిస్తానంటున్నాడు రికీ. ఇప్పటికి ఈ రోభామ కోసం రూ.35లక్షల వరకూ ఖర్చు చేశాడు.