Begin typing your search above and press return to search.

చైనాలో 7 పిల్లల్ని కన్నందుకు రూ.71లక్షల ఫైన్

By:  Tupaki Desk   |   9 Oct 2015 2:21 PM GMT
చైనాలో 7 పిల్లల్ని కన్నందుకు రూ.71లక్షల ఫైన్
X
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా రికార్డు ఉన్న చైనాలో ఒకరికి జన్మ ఇవ్వటం కూడా పెద్ద తలనొప్పి వ్యవహారమే. ఇక.. రెండో వారికి జన్మనివ్వాలంటే చాలానే లెక్కలు ఉంటాయి. అందుకే.. ఇద్దరి కనేందుకు చైనీయులు వణికిపోతారు. ఈ మధ్య కాలంలో నిబంధనల్ని కాస్త సడలించినా.. ఇద్దరు పిల్లల్ని కనే విషయంలో చైనీయుల మీద ఆంక్షలు చాలానే ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి పరిస్థితుల్లో మార్పులు వచ్చినా.. నిబంధనలు మాత్రం కఠినంగానే అమలు చేస్తున్నారు.

ఓపక్క ఇద్దరు పిల్లలు కనేందుకు అనుమతి లభించినా.. పలు నియంత్రణలు ఇప్పటికి అమలవుతున్నాయి. ఓపక్క ఇద్దరు పిల్లల విషయంలోనే ఇన్ని ఆంక్షలు ఉంటే.. బీజింగ్ లోని టాంగ్ ఝౌ జిల్లాకు చెందిన దంపతులకు ముగ్గరు అబ్బాయిలు.. నలుగురు అమ్మాయిల్ని కనేశారు. ఈ విషయం తాజాగా అధికారుల తనిఖీలో బయటకు వచ్చింది.

దీంతో.. అగ్రహించిన అధికారులు వీరిపై భారీగా జరిమానాను విధించారు. వారిపై విధించిన ఫైన్ ను రూపాయిల్లోకి మారిస్తే.. దాదాపు అది రూ.71.35 లక్షలకు సమానమని చెబుతున్నారు. చైనాలో పిల్లలకు ఉచిత విద్య.. ఆరోగ్య రక్షణతో పాటు.. సామాజిక సంక్షేమ ఫలాలు అందాలంటే హుకావ్ అనుమతి తప్పనిసరి.

నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వారికి హుకావ్ అనుమతిని రద్దు చేస్తారు. అదే జరిగితే.. ఉన్నత విద్య చదువుకునే వీలు ఉండదు. ఏడుగురు పిల్లల్ని కన్న కుటుంబంపై స్థానిక జనాభా కుటుంబ నియంత్రణ కమిషన్ ఈ భారీ జరిమానా విధించటంతో వారు లబోదిబో అంటున్నారు.