Begin typing your search above and press return to search.

కరోనాను గుర్తించిన వైద్యుడికి చైనా సారీ చెప్పేసింది

By:  Tupaki Desk   |   21 March 2020 3:30 AM GMT
కరోనాను గుర్తించిన వైద్యుడికి చైనా సారీ చెప్పేసింది
X
ప్రాణాంతక వైరస్ కరోనా చైనా నుంచే ప్రబలింది. అయితే ఆలస్యంగా చర్యలు చేపట్టినా... చైనా ఆ వైరస్ ను నియంత్రించేసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ క్రమంలో ఈ వైరస్ ను తొలిసారిగా గుర్తించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేద్దామని యత్నించిన ఓ వైద్యుడి పట్ల క్రూరంగా వ్యవహరించిన చైనా... తీరా అతడు ప్రాణాలు వదిలాక తాపీగా సారీ చెప్పేసి చేతులు దులుపుకుంది. ఈ ఆసక్తికర ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే... తాను పరిశీలించిన వ్యక్తుల్లో ఏడుగురికి సార్స్ వైరస్ ను పోలిన వైరస్ ను తాను గుర్తించానని చైనాకు చెందిన వైద్యుడు లీ వెన్ యాంగ్ అక్కడి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. డిసెంబర్ 30న ఈ విషయాన్ని ‘వి చాట్’ గ్రూప్ లో ఆయన షేర్ చేశారు. దీంతో వెనువెంటనే రంగంలోకి దిగిన వూహాన్ పోలీసులు వెన్ లియాంగ్ కు ఏకంగా వార్నింగ్ ఇచ్చారట. ఏకంగా పోలీసుల నుంచే వార్నింగ్ రావడంలో వెన్ లియాంగ్ కూడా సైలెంట్ అయిపోయారట.

కరోనా లక్షణాలున్న వ్యక్తులకు వైద్య పరీక్షలు చేసిన నేపథ్యంలో వెన్ లియాంగ్ కు ఆ వైరస్ సోకింది. ఆ వైరస్ కారణంగానే ఆయన జనవరి 10న ప్రాణాలు వదిలారు. అంటే... కరోనాను గుర్తించిన వెన్ లియాంగ్ పది రోజులు తిరగ్గానే... అదే వైరస్ కారణంగా చనిపోయారు. వెన్ లియాంగ్ చనిపోయాక, దేశంలో కరోనా తన విక్రూతరూపం దాల్చాక గానీ చైనా అధికారులకు తెలిసిరాలేదట. దీంతో వెన్ లియాంగ్ కుటుంబానికి వూహాన్ పోలీసులు సారీ చెప్పారట.