Begin typing your search above and press return to search.

పాతాళ పతనానికి సూత్రధారి అతగాడేనా?

By:  Tupaki Desk   |   27 Aug 2015 3:55 AM GMT
పాతాళ పతనానికి సూత్రధారి అతగాడేనా?
X
గంటల వ్యవధిలో.. కళ్ల ముందే.. లక్షల కోట్ల రూపాయిలు కరిగిపోవటం లక్షలాది కుటుంబాల్ని ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ ప్రభావితం చేసిన సంగతి తెలిసిందే. బ్లాక్ మండే కారణంగా ఒక్క భారత్ లోనే కాదు.. చైనాతో సహా పలు ఆసియా.. యూరప్.. అమెరికా దేశాల్లో ఎంత భారీ నష్టం వాటిల్లిందో తెలిసిందే. మరింత భారీ పతనానికి కారణం ఏమిటన్న వెంటనే.. వినిపించే మాట.. చైనా తన యెన్ విలువను తగ్గించటం.. చైనా ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవటం లాంటి వాదనలు వినిపిస్తుంటాయి.

అయితే.. తాజాగా చైనాలోని ఒక స్టార్ హోటల్ లో మాత్రం ఆ దేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త షాన్ జియాలింగ్ మీద దాడి చేశారు. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలటానికి అతగాడే సూత్రధారి అన్న వాదన వినిపిస్తోంది. షాంఘై లోని ఒక స్టార్ హోటల్ కు వచ్చిన అతగాడి మీద మహిళలతో సహా పలువురు అగ్రహంతో ఊగిపోతూ ఆయనపై కలబడి దారుణంగా దాడి చేశారు. అనంతరం అతన్ని లాక్కుపోయి పోలీసులకు అప్పజెప్పారు.

తాము ఎన్నో ఆశలతో పెట్టుబడులు పెడితే.. అవన్నీ కరిగిపోయాయని.. తమ నష్టానికి అతగాడే కారణమంటూ మదుపరులు ఆరోపిచంటం గమనార్హం. ఫాన్యా మెటల్స్ కంపెనీ వ్యవస్థాపకుడైన షాన్ జియాలింగ్ స్టాక్ మార్కెట్ కుప్పకూలటానికి కారణంగా ఆరోపిస్తున్నారు. ఇతగాడిని తీసుకెళ్లి పోలీసులకు అప్పజెప్పినా.. కాసేపటికే అతన్ని పోలీసులు వదిలేయటం గమనార్హం. మరి.. షాన్ జియాలింగ్ పాత్ర ఏమిటి? అతను ఏ విధంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు కూలిపోవటానికి కారణమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది.