Begin typing your search above and press return to search.
13,500 కిలోల బంగారం లంచం తీసుకున్న చైనా వ్యక్తి!
By: Tupaki Desk | 4 Oct 2019 10:02 AM GMTఎక్కడైనా అవినీతి అధికారుల దాడుల్లో చిక్కిన వాళ్ళ దగ్గర నుండి భారీ స్థాయిలో డబ్బు, ఎంతోకొంత బంగారం, వెండి లాంటివి స్వాధీనం చేసుకుంటారు. కానీ చైనాలో జరిగిన ఈ సంఘటన మొత్తం చైనా ఆశ్చర్యానికి లోనయ్యేలా చేసింది. చైనా హైనాన్ ప్రావిన్స్ రాజధాని హైకౌర్ లో మేయర్ గా విధులు నిర్వహించిన జాన్ క్వీ కొన్ని వేల కిలోల బంగారాన్ని అక్రమంగా సంపాదించినట్టు గుర్తించారు.
అతని దగ్గర ఉన్న బంగారం ఎంతో తెలుసా... 13,500 కిలోలు. ఈ బంగారం విలువ 2.68 లక్షల కోట్లు ఉంటుందని అంటున్నారు. ఈ డబ్బు మన తెలుగు రాష్ట్రాల బడ్జెట్ తో సమానం. జాన్ క్వీ ఇంట్లో సోదాలు నిర్వహిస్తే ప్లాస్టిక్ సంచుల్లో మూటలు కట్టిన బంగారం, పెద్ద పెద్ద అలమరాలలో దాచిన బంగారు ఇటుకలు చూసి అధికారులకు కళ్ళు బైర్లు కమ్మాయి. ఈ బంగారం మాత్రమే కాకుండా ఎక్కువ మొత్తంలో డబ్బు, పెద్ద పెద్ద విల్లాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు, బంగారం అంతా లంచాలతోనే సంపాదించినట్టు అధికారులు చెప్పారు. ఇదే నిజమైతే చైనాలో అలీబాబా కంటే జాన్ క్వీ నే ధనవంతుడు.